మహారాష్టపైనే బీఆర్ఎస్ ఫోకస్..మరో పవర్ సెంటర్‌గా సీఎం కేసీఆర్..?

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఫోకస్ మహారాష్ట్రపై పడింది. గతవారంలో మహారాష్ట్ర పర్యటన సందర్భంగా హైదరాబాదు నుంచి 600 వాహనాలు కలిగిఉన్న కాన్వాయ్‌తో బయలుదేరారు.ఇక ఇక్కడి నుంచే కేసీఆర్ తన బలాన్ని చాటారు. అక్కడ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)నుంచి పలువురు నేతలు బీఆర్ఎస్‌లో చేరారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాలపై కేసీఆర్ తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఇక బీఆర్ఎస్ గుర్తు కూడా కారు కావడంతో.. మహారాష్ట్రలోకి తాను అడుగుపెడుతున్నట్లు చెప్పేందుకు 600 కార్లతో కూడిన కాన్వాయ్‌తో ఆ రాష్ట్రంకు చేరుకున్నారు.జూన్ 26-27 తేదీల్లో కేసీఆర్ మహారాష్ట్రలో పర్యటించారు. అయితే మొత్తంగా చూస్తే బీఆర్ఎస్‌గా పార్టీ రూపాంతరం చెందిన తర్వాత మహారాష్ట్రలో పర్యటించడం కేసీఆర్‌కు ఇది ఐదోసారి. తన పార్టీ జాతీయ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటుందని ప్రకటించిన తర్వాత ఆయా రాష్ట్రాల్లో కేసీఆర్ పర్యటిస్తూ అక్కడ బీఆర్ఎస్ కార్యాలయంను ప్రారంభించి ఇతర పార్టీల నుంచి నేతలను కూడా చేర్చుకుంటున్నారు.

KCR

అయితే మహారాష్ట్రపై మాత్రం కేసీఆర్ ప్రత్యేక ఫోకస్ పెట్టారు.పొరుగు రాష్ట్రాల్లో పార్టీని విస్తరింపజేసేందుకు అన్ని అవకాశాలను కేసీఆర్ ఉపయోగించుకుంటున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. తెలంగాణ బయట బీఆర్ఎస్ పార్టీ బలోపేతం అయ్యేందుకు ఎక్కువగా మహారాష్ట్రనే కనిపిస్తోంది.ఇందుకు మూడు కారణాలను పార్టీనేతలు ప్రస్తావిస్తున్నారు.

రెండు రాష్ట్రాల్లో సరిహద్దులు, సంస్కృతులు:
తెలంగాణ రాష్ట్రంతో మహారాష్ట్రకు చెందిన నాలుగు జిల్లాలు సరిహద్దును కలిగి ఉన్నాయి.నాందేడ్, యావత్మాల్, చంద్రాపూర్, గడ్చిరోలి. ఈ సరిహద్దుల నుంచే రాజకీయాలు చేసి మహారాష్ట్రలోకి దూసుకెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోంది.రాష్ట్రాల పునర్విభజనకు ముందు మరఠ్వాడా ప్రాంతం నిజాం పాలనలో హైదరాబాద్ రాష్ట్రం కింద ఉండేది. అప్పుడు ఈ రెండు ప్రాంతాలు ఒకే సంస్కృతిని పంచుకునేవి.ఈ అంశంపైనే దృష్టి పెట్టిన బీఆర్ఎస్, మహారాష్ట్రలోని ఔరంగాబాద్, నాగ్‌పూర్, అమరావతి జిల్లాల్లో తెలుగు మాట్లాడేవారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

 KCR

కేసీఆర్ ఫోకస్ ఈ డివిజన్లపై ఉండటంతో అక్కడ బీఆర్ఎస్ కార్యాలయాలు కూడా ప్రారంభించారు.నాగ్‌పూర్‌లో బీఆర్ఎస్ ఆఫీసు ప్రారంభించిన సీఎం కేసీఆర్ నాందేడ్, ఔరంగాబాద్, సోలాపూర్‌లలో బహిరంగ సభల్లో కూడా ప్రసంగించారు. ప్రస్తుతం దక్షిణ మహారాష్ట్ర ప్రాంతంలోని ఓబీసీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ.

KCR

రైతుల అభివృద్ధి కోసం:
రైతులకు రైతు బంధు పథకం, గ్రామాల్లో నిరంతర నాణ్యమైన విద్యుత్, రహదారుల నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాలు బీఆర్ఎస్ ప్రభుత్వం విజయవంతంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లోని రైతులను ఈ పథకాలు కార్యక్రమాలు ఆకట్టుకుంటాయని కేసీఆర్ భావిస్తున్నారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో రైతు సంక్షేమ పథకాలు అమలవుతుండటంతో అక్కడి స్థానిక నేతలను రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఈ పథకాలన్నిటినీ మహారాష్ట్రలో కూడా అమలు చేస్తామనే హామీ ఇస్తోంది.

KCR

మహారాష్ట్రలో రాజకీయ శూన్యత:
మహారాష్ట్రలో పలు ముఖ్యమైన పార్టీలు ఉన్నప్పటికీ ఆ రాష్ట్రంలో ఇంకా రాజకీయ శూన్యత ఉందని బీఆర్ఎస్ భావిస్తోంది.ఎన్సీపీలో అంతర్గత విబేధాలు, శరద్ పవార్ ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగిస్తుండగా,శివసేనలో చీలికతో మహారాష్ట్రలో కచ్చితంగా రాజకీయ శూన్యత ఉందని బీఆర్ఎస్ భావిస్తోంది.రెండు పార్టీలు క్యాడర్‌పై పట్టు కోల్పోయాయని బీఆర్ఎస్ పేర్కొంది. బీజేపీ కాంగ్రెస్‌లాంటి జాతీయ పార్టీలు ఉన్నప్పటికీ, గ్రామీణ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కచ్చితంగా తన మార్క్‌ను వేస్తుందని కాన్ఫిడెంట్‌గా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+