వరంగల్ రైల్వే స్టేషన్‌లో పేలుడు పదార్థాలు: సీజ్
వరంగల్: రైల్వే స్టేషన్‌లో పోలీసులు బుధవారం పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న జిలెటిన్‌స్టిక్స్, డిటోనేటర్లుతో కూడిన బ్యాగ్‌ను వరంగల్ రైల్వేస్టేషన్‌కు తీసుకువచ్చింది ఎవరు అనే విషయంపై పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.
పేలుడు పదార్థాలను తీసుకువచ్చింది క్రషర్ మిల్లులకు సంబంధించిన వారా లేక సంఘ విద్రోహశక్తుల అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. రైల్వేస్టేషన్‌లో రికార్డు అయిన సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు, విస్తృత తనిఖీలు చేపడుతున్నారు.

కాగా, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ పర్యటనకు రానున్న దృష్ట్యా తీవ్రవాదులు పేలుళ్లలకు పాల్పడవచ్చు అనే కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో వారం రోజులుగా ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు వరంగల్ రైల్వేస్టేషన్‌లో మెటల్ డిటెక్టర్లతో తనిఖీలను ముమ్మరం చేశారు.
స్టేషన్ ముందున్న మెటల్‌డిటెక్టర్ వద్ద దొరికిపోతాననే భయంతోనే బ్యాగ్‌ను బుకింగ్ కౌంటర్ వద్ద వదిలివేసి ఉంటారని భావిస్తున్నారు. అయితే త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications