రెండు తెలుగు రాష్ట్రాల్లోని స్పెషల్ ట్రైన్ సర్వీసులు పొడిగింపు..!
సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. వేసవి సెలవుల్లో ప్రయాణికులకు ప్రత్యేక ట్రైన్ల సర్వీసులను ఏర్పాటు చేశారు. అయితే, ఈ ట్రైన్ సర్వీసులను పొడిగిస్తూ మరో కీలక నిర్ణయం తీసుకుంది దక్షిణ మధ్య రైల్వే. జూన్ నెల చివరివారం వరకు ఈ స్పెషల్ ట్రైన్ సర్వీసులను పొడిగించారు. ఆ వివరాలేంటో ఓ సారి చూద్దాం..
వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే నాలుగు జతల స్పెషల్ ట్రైన్ సర్వీసులను జూన్ చివరి వారం వరకు పొడిగించింది. 07191 నెంబర్‌గల ట్రైన్ ప్రతి సోమవారం కాచిగూడ నుంచి మధురై వరకు బయలుదేరే ట్రైన్ జూన్ 24వ తేది వరకు పొడిగించారు. ప్రతి బుధవారం బయల్దేరే 07192 అనే నెంబర్‌గల ట్రైన్ మధురై నుంచి కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ను జూన్ 26వ తేదివరకు పొడిగించారు. 07435 అనే నెంబర్‌గల ట్రైన్ కాచిగూడ నుంచి నాగర్ కోయిల్ ప్రతి శుక్రవారం బయలుదేరే ఎక్సప్రెస్ జూన్ 28 వరకు పొడిగించారు. 07436 అనే నెంబర్‌గల ట్రైన్ ఆదివారం బయలుదేరే నాగర్‌కోయిల్-కాచిగూడ ఎక్స్‌ప్రెస్ జూన్ 30 వరకు పొడిగించారు. హెచ్‌ఎస్‌నాందేడ్-ఈరోడ్-హెచ్‌ఎస్‌నాందేడ్, జల్నా-ఛాప్రా-జల్నాట్రైన్లను కూడా పొడిగించినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వివరించారు.

వారంలో ఒకరోజు ఏసీ స్పెషల్ ట్రైన్..
ఇక ఆంధ్రప్రదేశ్‌లోని పలు రైళ్ల సర్వీసులను కూడా పొడిగించినట్లు అధికారులు తెలిపారు. విజయవాడ మీదుగా నడిచే హిసార్ , తిరుపతి స్పెషల్ రైళ్లను పొడిగించినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. విజయవాడ, ఉజ్జయినితో పాటు ప్రధాన స్టేషన్లలో ఆగే ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు తెలుస్తోంది. హౌరా - యశ్వంత్ పూర్ మధ్య వారంలో ఒకరోజు ఏసీ స్పెషల్ ట్రైన్ నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ అధికారి తెలిపారు. హౌరా నుంచి యశ్వంత్ పూర్ మధ్య నడిచే 02863 అనే నెంబర్ గల వీక్లీ ఏసీ స్పెషల్ ట్రైన్ నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైలు ఏప్రిల్ 4, 11 తేదీల్లో హౌరా స్టేషన్‌లో మధ్యాహ్నం 12.40 గంటలకు ప్రారంభమవుతుంది. అక్కడినుండి మరుసటి రోజు రాత్రికి 12.15 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుందని అధికారులు వివరించారు.












Click it and Unblock the Notifications