అక్రమ సంబంధం వద్దన్నారని ప్రేయసీప్రియులు ఉరేసుకున్నారు
ఆదిలాబాద్: తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. ఆదిలాబాద్ జిల్లా కెరిమెరి మండలం కచ్చెర్ల గ్రామంలో పోనారి శీను (48), సునీత (35) చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
ఆ ఇద్దరికి కూడా వేర్వేరు వ్యక్తులతో విహహమై పిల్లలు కూడా ఉన్నారు. అయితే, చాలా కాలంగా వీరిద్దరికి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. రెండు కుటుంబాలకు చెందినవారు కూడా ఈ విషయంపై ఘర్షణ పడుతున్నారు. అయినా వారు సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.

చివరకు వారికి గ్రామ పెద్దలు వారికి గ్రామ బహిష్కార శిక్ష విధించారు. వారం రోజుల క్రితం ఇద్దరు కూడా గ్రామం విడిచిపోయారు. చివరకు సోమవారం ఉదయం వారి ఇద్దరి శవాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. గ్రామస్తుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నరాు.
రెండు శవాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఆస్పత్రికి తరలించారు. గ్రామ బహిష్కారంతో మనస్తాపానికి గురై వారిద్దరు ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.












Click it and Unblock the Notifications