అత్తతో వివాహేతర సంబంధం: మేనమామను హత్య చేసి..
అత్తతో వివాహేతర సంబంధం పెట్టుకుని మేనమామనే హత్య చేశాడు ఓ దుర్మార్గుడు. ఇందుకు అతని అత్త కూడా సహకరించడం గమనార్హం. ఈ దారుణ ఘటన నగరంలో చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..
హైదరాబాద్: అత్తతో వివాహేతర సంబంధం పెట్టుకుని మేనమామనే హత్య చేశాడు ఓ దుర్మార్గుడు. ఇందుకు అతని అత్త కూడా సహకరించడం గమనార్హం. ఈ దారుణ ఘటన నగరంలో చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు జరిపి హత్యకు పాల్పడిన నిందితులను అరెస్ట్ చేశారు.

సౌదీకి వెళ్లిన మేనమామ
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మెహిదీపట్నం డివిజన్ మురాద్‌నగర్‌కు చెందిన ఫరీద్ అహ్మద్ కూతురు అబర్నార్‌ను 2015 మే 11న సనత్‌నగర్ డివిజన్ కైలాస్‌నగర్‌కు చెందిన రఫీక్‌కు ఇచ్చి వివాహం చేశారు. సౌదీ అరేబియాలో ఓ ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రఫీక్ పెళ్లయిన రెండు నెలల తర్వాత సౌదీకి వెళ్లిపోయి 2016 డిసెంబర్‌లో వీసా పంపించాడు.
Recommended Video


వివాహేతర సంబంంధానికి దారితీసిన చనువు..
అయితే, దుబాయ్‌కి వెళ్లిన అబర్నార్ నెలరోజులు అక్కడ ఉండి నగరానికి వెళ్లిపోతానని చెప్పింది. దీంతో చేసేది లేక రఫీక్ భార్యను పంపించేశాడు. నగరానికి చేరుకున్న అబర్నార్ తన సొంత ఆడబిడ్డ కొడుకైన యాసిన్‌తో చనువు ఏర్పడింది. కాగా, ఇది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో దుబాయ్‌లో ఉన్న రఫీక్ పలుమార్లు ఫోన్‌చేసినా మాట్లాడేందుకు నిరాకరించేది.

నువ్వంటే ఇష్టం లేదంటూ భర్తతో.
అంతేగాక, ఫోన్‌లో ఇటీవల భర్తతో మాట్లాడుతూ.. నువ్వంటే ఇష్టం లేదు.. విడాకులివ్వాలని తెగేసి చెప్పేది అబర్నార్. సెప్టెంబర్ 17న రఫీక్ తండ్రి మృతి చెందాడు. ఈ వార్త తెలియగానే రఫీక్ సెప్టెంబర్ 27న నగరానికి వచ్చాడు.

కుట్రతో హత్య చేశారు..
అబర్నార్, యాసిన్‌లు తమ ఇంటి సమీపంలో మరో గది తీసుకుని సహజీవనం చేస్తున్నారు. సెప్టెంబర్ 30న తాము ఉంటున్న ఇంటికి రావాలని రఫీక్‌కు భార్య కబురు పంపింది. రఫీక్ అక్కడికి వెళ్లి భోజనం ముగించుకొని నిద్రకు ఉపక్రమించాడు. అప్పటికే అతడ్ని చంపాలను కుట్ర పన్నిన యాసిన్, అబర్నార్‌లు రఫీక్ మెడకు తాడు బిగించి వంట గిన్నెతో యాసిన్ తలపై బలంగా మోదారు. దీంతో రఫీక్త అక్కడికక్కడే మృతి చెందాడు.

ఏమీ తెలియనట్లుగా..
రఫీక్ మృతి నిర్ధారించుకున్న యాసిన్.. అబర్నార్‌ను పంపించివేసి ఏమీ తెలియనట్లుగా ఇంటికి వెళ్లిపోయాడు. మరుసటిరోజు రఫీక్ సోదరుడి కొడుకు వచ్చి చూడగా రక్తపు మడుగులో పడిపోయి ఉన్నాడు. విషయం వెంటనే కుటుంబసభ్యులకు తెలియజేయడంతో వారు ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన ఎస్‌ఐ నవీన్ పలు కోణాల్లో విచారణ జరిపి హత్యకు కారకులైన భార్య అబర్నార్, మేనల్లుడు యాసిన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications