ఫేస్‌బుక్‌లో ఫోటో: ఈత రాక ప్రాణం పోయింది

ఫోటోలు దిగేందుకు కుంటలోకి దిగిన సురేందర్ రెడ్డి (21) ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. స్నేహితులు కాపాడదామని ప్రయత్నించినా కుంట ఎక్కువ లోతు ఉండటంతో ఫలితం లేకపోయింది. దీంతో అతని స్నేహితులు ఇబ్రహీంపట్నం పోలీసులకు సామాచారం ఇచ్చారు.
మంగళవారం ఉదయం శవమై తేలిన సురేందర్ రెడ్డి మృతదేహాన్ని ఎస్‌ఐ ఇప్తికార్ అహ్మాద్ నేతృత్వంలో పోలీసులు బయటకు తీశారు. మృతదేహాన్ని స్దానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టు మార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు.
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇక సురేందర్ రెడ్డి తండ్రి తిరుపతి రెడ్డి ఉప్పరిగూడలో ఓ చిన్న టిఫిన్ సెంటర్‌ను నిర్వహిస్తూ కుటుంబ పోషణను కొనసాగిస్తున్నాడు. యుక్త వయసున్న కొడకు అర్దాంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు.












Click it and Unblock the Notifications