కేజీ బంగారం రూ. 3లక్షలే: అక్కడే ఉంది అసలు ట్విస్ట్!
ఇత్తడికి బంగారం పూత పూసి వెంకటేశ్వరరావు అనే ఓ వ్యక్తిని బురిడీ ఇద్దరు వ్యక్తులు బురిడీ కొట్టించారు.
జగిత్యాల: ఇత్తడికి బంగారం కోటింగ్ ఇచ్చిన ఇద్దరు వ్యక్తులు.. అసలు సిసలు బంగారం అంటూ దాన్ని ఓ వ్యక్తికి కట్టబెట్టారు. రూ.3లక్షలు చెల్లించి ఆ బంగారాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి.. తీరా అసలు విషయం తెలిసి షాక్ తిన్నాడు. చేసేదేమి లేక పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు తమదైన శైలిలో నిందితులను వలపన్ని పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. గత నెల 10వ తేదీన వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. తమ ఇంటిని కూల్చివేస్తున్నప్పుడు కేజీ బంగారం బయటపడిందని, దాన్ని కేవలం రూ.3లక్షలకే విక్రయించాలనుకుంటున్నామని వెంకటేశ్వరరావుతో చెప్పారు.
ఆ తర్వాత వెంకటేశ్వరరావును కలిసి, 1 గ్రాము బంగారు కాయిన్ చూపించారు. దాన్ని టెస్ట్ చేయించి, నిజమైన బంగారమే అని వెంకటేశ్వరరావు నిర్ధారించుకున్నాడు. అసలు బంగారమే అని నిర్దారణ కావడంతో రూ.3లక్షలు చెల్లించి వారి వద్దనుంచి కేజీ బంగారం కొనుగోలు చేశాడు.

అనంతరం ఆ బంగారంతో ఓ జ్యువెలరీ షాపుకు వెళ్లగా.. ఇత్తడికి బంగారం పూత పూసి మోసం చేశారని తేలింది. మోసపోయానని తెలుసుకున్న తర్వాత పోలీసులను ఆశ్రయించాడు. దీంతో మరికొంత బంగారం కావాల్సిందిగా నిందితులకు ఫోన్ చేయమని పోలీసులు సూచించారు.
పోలీసుల సూచన మేరకు.. నిందితులకు ఫోన్ చేసి మరికొంత బంగారం తీసుకురావాలని వెంకటేశ్వరరావు కోరాడు. దీంతో మరికొంత బంగారంతో మళ్లీ జగిత్యాలలో వాలిపోయారు నిందితులు. ఈ క్రమంలో ముందస్తు వ్యూహం ప్రకారం వారిని వలపన్ని పట్టుకున్నారు పోలీసులు. నిందితులను బళ్లారి జిల్లా బత్తలపల్లికి చెందిన కావడి రవిచంద్ర, కావడి శ్రీకాంత్ లుగా గుర్తించారు. వారి నుంచి రూ. 2.8 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications