హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉదయసింహా బంధువు ఇంట్లో నకిలీ ఐటీ దాడులు?: బంగారం, నగదుతోపాటు అతడ్నీ తీసుకెళ్లారు!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తులు, ఓటుకు నోటు కేసులో నిందితుడైన ఉదయసిన్హా బంధువు రణధీర్ ఇంట్లో ఆదివారం ఐటీ అధికారుల పేరుతో దుండగులు సోదాలు చేసినట్లు రణధీర్ కుటుంబసభ్యులు చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసులు సరిగా స్పందించడం లేదని రణధీర్ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

రేవంత్ నివాసంలో ముగిసిన ఐటీ సోదాలు, కీలక పత్రాలు సీజ్, ఆ రూ.20కోట్లు ఎక్కడివి?రేవంత్ నివాసంలో ముగిసిన ఐటీ సోదాలు, కీలక పత్రాలు సీజ్, ఆ రూ.20కోట్లు ఎక్కడివి?

చైతన్యపురి పరిధిలోని జైపురికాలనీలోని ఉదయసింహా బంధువైన రణధీర్ ఇంట్లో 15మంది ఐటీ అధికారులమంటూ ఆదివారం సోదాలు నిర్వహించారు. అంతేగాక, నగలు, నగదు వివరాలను ఓ పత్రంలో రాసిపెట్టి వాటిని తమవెంట తీసుకెళ్లారు. ఉదయసింహ బంధువైన రణధీర్‌ను వారు తమ వెంట తీసుకెళ్లారు.

Fake IT raids in Udayasimhas relative house

రణధీర్ గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆయన కుటుంబసభ్యులు చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ ఐదు ఫోన్ల కూడా దుండగులు తీసుకెళ్లారని తెలిపారు. అయితే, తమ ఫిర్యాదును పోలీసులు అంత సీరియస్‌గా తీసుకోలేదని.. స్టేషన్ అధికారి నవ్వారని చెప్పారు.

తాము దాడులు జరుపలేదన్న ఐటీ అధికారులు

రణధీర్ ఇంట్లో ఐటీ అధికారులమంటూ సోదాలు చేసి సెల్‌ఫోన్లు, నగదు, బంగారం తీసుకెళ్లినట్లు ఉదయసింహా ఐటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే, తాము సోదాలు చేయలేదని చెప్పడంతో ఉదయసింహా షాక్‌కు గురయ్యారు. వెంటనే ఈ సోదాలపై చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో రణధీర్ కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసులు పట్టించుకోకుంటే డీజీపీ, కోర్టులను ఆశ్రయిస్తామని చెప్పారు.

English summary
Fake IT raids in Udayasimha's relative house in Chaitanyapur in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X