నకిలీ పోలీసు: ప్రేమికులను భయపెట్టి దోచుకుంటున్నాడు

హైదరాబాద్: పోలీసునంటూ ప్రేమికులను భయపెట్టి దోచుకుంటున్న ఓ నకిలీ పోలీసును రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. నల్లగొండ జిల్లా వట్టిపల్లి గ్రామానికి చెందిన ఎడ్ల నర్సింహ(26) కొంత కాలంగా ప్రేమికులను భయపెట్టి దోచుకుంటున్నాడు.

హయత్‌నగర్‌ మండల శివారులోని సంఘీనగర్‌ దేవాలయానికి వచ్చే ప్రేమికులను బెదిరిస్తూ ఒంటిపై ఉన్న బంగారు గొలుసులు, నగదును కాజేస్తున్నాడు. గురువారం సంఘీరోడ్డులో ఓ ప్రేమ జంటను బెదిరిస్తుండగా అటుగా వెళ్తున్న కానిస్టేబుల్‌ నర్సింహ, హోంగార్డు జంగయ్య గమనించి నర్సింహను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Fake police arrested near hyderabad

ఇదిలావుండటే, కరీంనగర్ ‌ జిల్లాలోని రాయ్‌కల్‌ మండలం అల్లీపూర్‌లో ఓ మహిళను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గతంలో హతురాలు తన భర్త, అత్తామామ హత్యకేసులో శిక్ష అనుభవించినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+