Falcon Scam: ఫాల్కన్ స్కామ్‌లో ఈడీ దూకుడు.. అమర్‌దీప్ చార్టర్డ్ ఫ్లైట్ సీజ్!
Falcon Scam: ఫాల్కన్ స్కామ్ కేసు దర్యాప్తులో ఈడీ దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన చార్టర్డ్ ఫ్లైట్ ను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రూ.850 కోట్ల ఫాల్కన్ స్కామ్ తో సంబంధం ఉన్న ఒక ప్రైవేట్ జెట్ ను ఈడీ సీజ్ చేసింది. ఈడీ శుక్రవారం ఈ చర్య చేపట్టింది. 4 గంటల పాటు ఈడీ అధికారులు ఫ్లైట్ ను చుట్టుముట్టి అందులో ఉన్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జనవరి 22న అమర్‌దీప్ కుమార్ దుబాయ్‌కు పారిపోవడానికి ఈ విమానాన్ని ఉపయోగించాడు. దర్యాప్తులో ఈ విమానం అమర్‌దీప్‌కు చెందినది అని వెల్లడైంది.
కొన్ని రోజుల క్రితం దుబాయ్ కు ఈ ఫ్లైట్ లో పారిపోయిన నిందితులు తిరిగి ఈ విమానాన్ని హైదరాబాద్ కు పంపారు. అర్ధరాత్రి సమయంలో ఈ విమానం ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయింది.పెట్టుబడుల పేరిట రూ.850 కోట్ల ఫాల్కన్ స్కామ్ లో వచ్చిన డబ్బులో రూ. 14 కోట్లతో ఆ కంపెనీ చైర్మన్ అమర్ దీప్ చార్టర్డ్ ఫ్లైట్ ను కొనుగోలు చేసారు. ఇక తాజాగా దుబాయ్ నుంచి హైదరాబాద్ కు ఈ విమానం రాగా.. మెడికల్ ఎమర్జెన్సీ పేరుతో ఫ్లైట్ ను శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్ అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో ఎమర్జెన్సీ ఏమీ లేకపోవడంతో ఎయిర్ పోర్టు అధికారులు ఈడీకీ సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన అధికారులు చార్టర్డ్ ఫ్లైట్ ను సీజ్ చేశారు. ఫాల్కన్ స్కామ్ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 15న సైబరాబాద్ పోలీసులు ఫాల్కన్ క్యాపిటల్ వెంచర్స్ వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ ఓదెల, డైరెక్టర్ కావ్య నల్లూరిలను అరెస్టు చేశారు. ఈ కేసులో ఫాల్కన్ కంపెనీ ఛైర్మన్ అమర్ దీప్ సహా మరికొందరు కీలక వ్యక్తులు పరారీలో ఉన్నారు.

ED Seizes Private Jet Linked to ₹850 Crore Falcon Scam at Hyderabad Airport
— Sudhakar Udumula (@sudhakarudumula) March 8, 2025
The Enforcement Directorate (ED) on Friday seized a Hawker 800A jet (N935H) at Rajiv Gandhi International Airport (RGIA), allegedly owned by Amardeep Kumar, the prime accused in the ₹850 crore Falcon… pic.twitter.com/ycxIee9V25
ఫాల్కన్ స్కామ్ ఇదే..
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలని నమ్మించి ఫాల్కన్ కంపెనీ రూ.1700 కోట్లను సేకరించింది. ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ప్లాట్‌ఫామ్ పేరుతో మల్టీలెవెల్ మార్కెటింగ్ స్కీమ్ ల పేరుతో కోట్లు కొల్లగొట్టింది. ఇందులో రూ.850 కోట్లు డిపాజిటర్లకు తిరిగి చెల్లించగా.. మిగిలిన రూ.850 కోట్లు తిరిగి చెల్లించకుండానే ఫాల్కన్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ప్రజల నుంచి వచ్చిన డబ్బులతోనే కీలక సూత్రధారి అమర్ దీప్ రూ.14 కోట్లతో ఈ చార్టర్డ్ ఫ్లైట్ కొనుగోలు చేశాడు. సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేయగానే ప్రధాన నిందితుడు అమర్ దీప్ తో పాటు 10 మంది దుబాయ్ కు పరారయ్యారు. ఈ క్రమంలో అమర్ దీప్ తో పాటు 15 మందిపై సైబరాబాద్ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.












Click it and Unblock the Notifications