మరో ఇందూర్‌గా మునుగోడు..? భారీగా నామినేషన్లు, మరీ గెలుపు ఎవరికీ దక్కెనో..?
మునుగోడు బై పోల్ హీటెక్కిస్తోంది. షెడ్యూల్ విడుదల కావడంతో పార్టీలు ప్రచారం స్పీడ్ మరింత పెంచేశాయి. అయితే ప్రధాన పార్టీలకు ఒక షాకింగ్ న్యూస్.. ఎన్నికల బరిలో భారీగా నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తీరుతో ఆగ్రహాంగా ఉన్న వీఆర్ఏలు, లారీ డ్రైవర్స్ అసోసియేషన్, భూ నిర్వాసితులు కూడా బరిలోకి దిగుతున్నారని తెలిసింది. దీంతో నామినేషన్లు భారీగా దాఖలయ్యే అవకాశం ఉంది.
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో జరిగే ఉప ఎన్నికలో భారీగా నామినేషన్లు దాఖలు అయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సమస్యల పరిష్కారం కోసం రోజుల తరబడి నిరాహార దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఉప ఎన్నికల్లో తమ కుటుంబ సభ్యులతో మూకుమ్మడిగా నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు.

వీఆర్ఏలతోపాటు లారీ డ్రైవర్స్ అసోసియేషన్, భూ నిర్వాసితులు కూడా మునుగోడు ఉప ఎన్నికల్లో నామినేషన్లు వేయబోతున్నారు.దీంతోగా మునుగోడు ఉప ఎన్నికల్లో భారీగా నామినేషన్లు దాఖలు కానున్నాయి.గతంలో కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పోటీ చేసిన నిజామాబాద్ లోక్ సభ స్థానానికి పసుపు రైతులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఆ ఎన్నిక విజయవాకాశాలను దెబ్బతీశాయి. సిట్టింగ్ ఎంపీ కవిత ఓటమిని చవిచూశారు. అనూహ్యంగా ధర్మపురి అర్వింద్ గెలుపొందారు. అయితే ఆయన కూడా పసుపు బోర్డు తీసుకొస్తానని చెప్పడంతో విజయం సాధించారు. ఆ తర్వాత ఆ మాట మరవడంతో పెద్ద ఎత్తున నిరసనలు ఎదుర్కొన్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications