Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విషాదం: రైతు కుటుంబం ఉసురు తీసిన రూ. 5 లక్షల బాకీ

సిద్ధిపేట: ఐదు లక్షల రూపాయల అప్పు ఓ రైతు కుటుంబాన్ని బలి తీసుకుంది. నలుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు ప్రయత్నించగా రైతు భార్య మాత్రం ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం పోతారం (జె) గ్రామ పంచాయతీ పరిధిలోని తురకవానికుంటలో ఆ విషాద సంఘటన చోట చేసుకుంది. పోలీసులు ఆ సంఘటనకు సంబంధించిన వివరాలను అందించారు.

 పురుగుల మందు సేవించి..

పురుగుల మందు సేవించి..

తురకవానికుంట గ్రామానికి చెందిన రైతు, టీఆర్‌ఎస్‌ గ్రామ శాఖ అధ్యక్షుడు గుండ భగవాన్‌ రెడ్డి(50), ఆయన భార్య రాజవ్వ(45), కుమారుడు ప్రేమ్‌చంద్‌ రెడ్డి(25), కూతురు రోజా(22) సోమవారం రాత్రి పురుగుల మందు సేవించారు. భగవాన్‌ రెడ్డి దాంతో సరిపెట్టకుండా చీరతో ఉరి వేసుకున్నాడు.

 వారు వచ్చి చూసే సరికి..

వారు వచ్చి చూసే సరికి..

భగవాన్‌రెడ్డి, రాజవ్వ ప్రతి రోజూ ఉదయమే లేచేవారు. అయితే మంగళవారం ఉదయం ఎంతసేపటికీ తలుపు తీయలేదు. దాంతో ఇంటిపక్కన ఉంటున్న బంధువులు వచ్చి చూశారు. లోపల భగవాన్‌రెడ్డి కుమారుడు, కూతురు, భార్య కదలికలు లేకుండా పడి ఉన్నారు. కరెంట్‌ షాక్‌ కొట్టిందేమోనని అనుమానంతో ఫ్యూజు తీసేసి లోపలికి వెళ్లి చూశారు. భగవాన్‌ రెడ్డి ఉరి వేసుకుని ఉండడం చూశారు. రాజవ్వ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండటంతో చికిత్స నిమిత్తం హుస్నాబాద్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఆమెను కరీంనగర్‌లోని ప్రైవే టు ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేయిస్తున్నారు.

 ఎవరూ కారణం కాదు..

ఎవరూ కారణం కాదు..

భగవాన్‌ రెడ్డి తన వ్యవసాయ భూమిలో వరి, పత్తి పంటలు వేశారు. తెగులు తగలడంతో దిగుబడి సరిగా రాలేదు. పంట కోసం అప్పుగా తెచ్చిన పెట్టుబడులు, పిల్లల చదువు కోసం చేసిన అప్పులు- అన్నీ కలిపి రూ.5 లక్షల దాకా ఉంటాయని అంచనా. అప్పులు ఎలా తీర్చాలో పాలుపోక మనస్తాపానికి గురై తీవ్రమైన చర్యకు పాల్పడ్డాడు. భార్య, పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమ మరణాలకు ఎవరూ కారణం కాదని, ఆర్థిక ఇబ్బందులతోనే చనిపోతున్నామని రాశాడు.

 కుమారుడు ఎంబిఎ పూర్తి చేశాడు..

కుమారుడు ఎంబిఎ పూర్తి చేశాడు..

భగవాన్‌ రెడ్డి కుమారుడు ప్రేమ్‌చందర్‌ రెడ్డి ఎంబీఏ పూర్తిచేశాడని, ఇటీవలే కానిస్టేబుల్‌ ఉద్యోగానికి ప్రయత్నించాడని, అయితే ఉద్యోగ రాలేదని, దీంతో అతడు హైదరాబాద్‌లో ఉంటూ గ్రూప్స్‌ రాసేందుకు శిక్షణ పొందుతున్నాడని అంటున్నారు. హుస్నాబాద్‌కు చెందిన తన స్నేహితుడు అకాలమరణం చెందడంతో ఆదివారమే అతడు అక్కడికి వచ్చాడని, తిరిగి హైదరాబాద్‌కు వెళ్తుండగా తండ్రి ఫోన్‌ చేసి ఇంటికి పిలిపించారని, తాము అతణ్ని చూడ్డం అదే ఆఖరుసారని ప్రేమ్‌చందర్‌ రెడ్డి స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు.

 కూతురు సైతం ఎంబిఎ..

కూతురు సైతం ఎంబిఎ..

భగవాన్‌ రెడ్డి కూతురు రోజా కూడా ఎంబీఏ చదివిందని, ఆమెకు పెండ్లి సంబంధాలు వస్తున్నాయని, అంతలోనే ఇంత ఘోరం జరిగిందని బంధువులు చెప్పారు. అయితే, ఈ మరణాలపై కొంత మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజవ్వ స్పృహలోకి వస్తే గానీ అసలు విషయం తెలియదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+