కొత్త చరిత్ర సృష్టిస్తాం: చిన్నారెడ్డి, సండ్రకు కెసిఆర్ కౌంటర్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: 2018 జనవరి 1వ, తేది నుండి రైతులతో సహా ప్రతి ఒక్కరికి 24 గంటల కరెంట్ సరఫరా చేస్తామని తెలంగాణ సీఎం కెసిఆర్ ప్రకటించారు. 24 గంటల
గంటల విద్యుత్‌తో పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని కెసిఆర్ అభిప్రాయపడ్డారు.

తెలంగాణ శాసనసభలో సీఎం కెసిఆర్ రైతు సమన్వయ సమితులు, రైతులకు పెట్టుబడిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఈ విషయమై శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చిన్నారెడ్డిపై కెసిఆర్ విమర్శలు కురిపించారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో టిడిపి,కాంగ్రెస్ ప్రభుత్వాల హయంలో చోటుచేసుకొన్న ఘటనలను కెసిఆర్ ప్రస్తావించారు. ఏ రకంగా రైతులకు అన్యాయం జరిగిందో కెసిఆర్ ప్రస్తావించారు.

వచ్చే ఏడాది నుండి 24 గంటల విద్యుత్

వచ్చే ఏడాది నుండి 24 గంటల విద్యుత్

2018లో తెలంగాణ రాష్ట్రం కొత్త చరిత్ర సృష్టించనున్నట్టు తెలంగాణ సీఎం కెసిఆర్ ప్రకటించారు. అసెంబ్లీలో కెసిఆర్ ఈ విషయాన్ని ప్రకటించారు. రైతు సమన్వయ
సమితులు, రైతులకు పెట్టుబడిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేయడం వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని కెసిఆర్ ప్రకటించారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా విద్యుత్ సరఫరాను పరిశీలిస్తున్నట్టు సీఎం గుర్తు చేశారు.

చిన్నారెడ్డి, సండ్రకు కెసిఆర్ కౌంటర్

చిన్నారెడ్డి, సండ్రకు కెసిఆర్ కౌంటర్

రైతు సమన్వయ సమితులు, రైతులకు పెట్టుబడుల విషయమై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి, టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలు రైతు సమితులు అవసరం లేదని ప్రభుత్వానికి సూచించారు. అయితే ఈ విషయమై కెసిఆర్ ఘాటుగానే స్పందించారు. కాంగ్రెస్, టిడిపి ప్రభుత్వాల హయంలో చోటుచేసుకొన్న ఘటనలను కెసిఆర్ ప్రస్తావించారు.టీడీపీ ప్రభుత్వం 2005లో రైతు మిత్ర బృందాలు ఎందుకు ఏర్పాటు చేశారని సీఎం ప్రశ్నించారు.వైఎస్ఆర్ సీఎంగా ఉన్న కాలంలో 2 లక్షల రైతు మిత్ర బృందాలు ఏర్పాటు చేసి రూ. 350 కోట్లు ఖర్చు పెట్టారని కెసిఆర్ ప్రశ్నించారు..

మెకానిక్‌లు, డ్రైవర్లు ఆదర్శ రైతులా?

మెకానిక్‌లు, డ్రైవర్లు ఆదర్శ రైతులా?

2005లో 50 వేల మంది ఆదర్శ రైతులను ఆనాటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నియమించిన విషయాన్ని గుర్తు చేశారు. రూ. 60 కోట్లు ఖర్చు చేసి.. ఆదర్శ రైతులుగా ఆటో డ్రైవర్లు, మెకానిక్‌లను నియమించారని సీఎం తెలిపారు.ఆదర్శ రైతుల పేరుతో ఆనాడు జరిగిన ఘటనలను కెసిఆర్ ప్రస్తావించారు.

తాళిబొట్లను తాకట్టు పెట్టారు

తాళిబొట్లను తాకట్టు పెట్టారు

తెలంగాణలో 23 లక్షల 62 వేల పంపుసెట్లు ఎందుకున్నాయని కెసిఆర్ ప్రశ్నించారు. గోదావరి,కృష్ణ జీవనదుల మధ్య తెలంగాణ రాష్ట్రం ఉన్నా బోర్లపైనే వ్యవసాయం చేయాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు.ఆడపడుచులు తమ తాళిబొట్టును కుదువపెట్టి వ్యవసాయానికి ఖర్చు పెట్టారని గుర్తు చేశారు.

ఆటోస్టాటర్లు తీసేయాలి

ఆటోస్టాటర్లు తీసేయాలి

రాష్ట్రంలో గత వారం రోజులుగా ప్రయోగత్మాకంగా విద్యుత్‌ను 24 గంటలు సరఫరా చేస్తున్నామని సీఎం తెలిపారు. 24 గంటల విద్యుత్ సరఫరా అద్భుతమైన పెట్టుబడులను ఆకర్షిస్తుందన్నారు. కరెంట్ సరఫరాలో కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. రైతులందరికీ ఆటోస్టాటర్లు తీసేయాలని విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు సీఎం. ఆటోస్టాటర్ల వల్ల భూగర్భ జలాలు తగ్గిపోయే అవకాశం ఉందన్నారు. వీటి వల్ల కలిగే నష్టాలపై రైతులకు ఎమ్మెల్యేలు, అధికారులు అవగాహన కల్పించాలని సీఎం అన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The farm sector in Telangana will get 24 hours free electricity from January next year Telangana Cm KCR announced in Assembly on Monday .

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి