Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బూమ్ రాంగ్, షర్మిల కీలక నిర్ణయం - టార్గెట్ రేవంత్...!!

వైఎస్ షర్మిల అనుకున్నది ఒకటి. జరుగుతోంది మరొకటి. అన్నీ మరిచి కాంగ్రెస్ తో విలీనానికి సిద్దమయ్యారు. కానీ, కాంగ్రెస్ తత్వం బోధపడింది. అయినా సర్దుకుపోవాలా.. ఒంటరి పోరుతో సత్తా చాటాలా అనే డైలమాలో షర్మిల ఉన్నారు. కాంగ్రెస్ కు తుది నిర్ణయం కోసం విధించిన డెడ్ లైన్ పూర్తయింది. ఇక వెయిటింగ్ అవసరం లేదనే అభిప్రాయంతో ఉన్నారు. ఎన్నికల్లో పోటీకి సిద్దం అవుతున్నారు. అదే జరిగితే కాంగ్రెస్ కా..షర్మిలకా...నష్టం ఎవరికి.

విలీనం పై డైలమా: వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరటం ఖాయమైందని కొంత కాలంగా ప్రచారం సాగింది. పార్టీ విలీనం పైన చర్చలు జరిగాయి. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ షర్మిల వ్యవహారంలో రాయబారం చేసారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో షర్మిల నేరుగా సోనియా, రాహుల్ తో సమావేశమయ్యారు.

Fed up with the congress System

పార్టీ విలీనంతో పాటుగా తాను తెలంగాణకే పరిమితం అయ్యే విషయం పైన చర్చించారు. పార్టీలో తగిన ప్రాధాన్యత ఉంటుందని సోనియా హామీ ఇచ్చారు. కానీ, తెలంగాణలో ప్రాధాన్యత పైన మాత్రం టీపీసీసీ చీఫ్ రేవంత్ తో పాటుగా కొందరు నేతలు అభ్యంతర వ్యక్తం చేసారు. ఈ సమయంలో షర్మిలకు సికింద్రాబాద్ లోక్ సభ లేదా కర్ణాటక నుంచి రాజ్యసభకు హామీ ఇచ్చినట్లు ప్రచారం సాగింది.

రేవంత్ అభ్యంతరం: షర్మిల తాను ఇప్పటికే పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించానని..అక్కడి నుంచే కాంగ్రెస్ అభ్యర్దిగా పోటీకి అవకాశం ఇవ్వాలని కోరారు. తనతో పాటుగా తన కోసం పని చేసిన వైఎస్సార్టీపీలోని మరి కొందరి సీట్ల విషయం పైన ప్రస్తావన చేసారు. కానీ, షర్మిలకు తెలంగాణలో ప్రాధాన్యత అంశం పైన పార్టీ నుంచి స్పష్టమైన హామీ రాలేదు.

పార్టీ జాతీయ కమిటీలో అవకాశం ఇస్తామని బుజ్జగించే ప్రయత్నం చేసారు. తనకు తెలంగాణలోనే రాజకీయంగా ప్రాధాన్యత కోరుకుంటున్నానని షర్మిల స్పష్టం చేసారు. ఏపీలో తన ప్రమేయం ఉండదని క్లారిటీ ఇచ్చారు. ఇదే సమయంలో కాంగ్రెస్ సీట్ల ఖరారు తుది దశకు వచ్చింది. షర్మిలతో సహా..మద్దతు దారులకు సీట్ల ప్రస్తావన లేకుండా పోయింది. దీంతో, షర్మిల తనతో చేసిన రాజకీయం అర్దమైంది.

YS Sharmilas unconventional run against national party, to target Revanth Reddy

షర్మిల నిర్ణయంపై ఉత్కంఠ: ఇక, కాంగ్రెస్ తో కలవాలో వద్దో తేల్చుకొనేందుకు నిర్ణయించారు. అందుకు ఈ రోజు (సెప్టెంబర్ 30) డెడ్ లైన్ గా ఫిక్స్ చేసారు. తాజాగా కాంగ్రెస్ నుంచి ఎటువంటి సానుకూల సంకేతాలు రాలేదని విశ్వసనీయ సమాచారం. ఇదే సమయంలో మరో నాలుగైదు రోజుల్లో కలిసి అన్నీ చర్చిద్దామంటూ వర్తమానం పంపినట్లు తెలుస్తోంది. కానీ, షర్మిల ఇక వేచి చూసేందుకు సిద్దంగా లేరని తెలుస్తోంది. పార్టీ ముఖ్య నేతలకు ఆహ్వానం పంపారు.

అవసరమైతే ఒంటరి పోరుకు సిద్దమవుతున్నారని సమాచారం. వైఎస్సార్ అభిమానులు...కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్న కొన్ని వర్గాల ఓట్లను షర్మిల పోటీలో ఉంటే చీల్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే పార్టీకి..టీపీసీసీ చీఫ్ గా రేవంత్ కు ఈ వ్యవహారం సవాల్ గా మారుతుంది. దీంతో, చివరి నిమిషంలో ఒత్తిడి పెంచేలా షర్మిల అడుగులు వేస్తున్నారు. మరి ..కాంగ్రెస్ తప్పని స్థితిలో షర్మిల డిమాండ్లకు అంగీకరిస్తుందా..లేక షర్మిల రాజీ పడతారా అనే ఉత్కంఠ పార్టీలో కొనసాగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+