బయటకురండి: పౌరుడిగా ఓటేసిన కేటీఆర్, పలు చోట్ల ఆందోళనలు
హైదరాబాద్: హైదరాబాదీలంతా బయటికొచ్చి స్వేచ్ఛగా తమ ఓటు హక్కను వినియోగించుకోవాలని తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బంజారాహిల్స్‌లో రోడ్ నంబర్ 10 పోలింగ్ కేంద్రంలో ఆయన తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధ్యత గల పౌరుడిగా ఓటేశానన్నారు. జంట నగరాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. నగర అభివృద్ధిని కాంక్షించే వారంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఓటర్లు ఎవరూ అయోమయానికి గురికావద్దని సూచించారు. గ్రేటర్ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ 83 శాతం ఓటర్ స్లిప్‌లను పంచిందన్నారు. మీ ఓటు గల్లంతైతే tsec.gov.in వెబ్‌సైట్‌లో చూసుకుని దాని ప్రకారం ఓటేయ్యొచ్చని సూచించారు. మీ వద్ద ఉన్న 21 ఐడీ కార్డుల్లో ఏదైనా ఒక దానిని తీసుకుని ఓటేయాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వంతో భాగస్వామి కావాలని కోరుకున్న ప్రజలు వారి ప్రాథమిక బాధ్యతగా ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరారు. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని, అందువల్ల ప్రజాస్వామ్యంలో పౌరులంతా తమ ప్రాథమిక కర్తవ్యాన్ని నెరవేర్చేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లి ఓటు వేయాలని సూచించారు.
పోలింగ్ స్లిప్ అందకపోతే ఇంటర్‌నెట్‌లో tsec.gov.in అనే వెబ్‌సైట్‌లో చూసుకుని ఆ నెంబరు ప్రకారం ఓటేయొచ్చని, అందరూ ఓటుహక్కును వినియోగించుకోవాన్నారు. మరోవైపు నగరంలో ఓట్ల గల్లంతుపై పలుచోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కూకట్‌పల్లిలోని వివేకానందనగర్ కాలనీలో ఒకే ఆపార్ట్‌మెంట్‌లో 60 ఓట్లు గల్లంతయ్యాయి. దీంతో ఓట్ల గల్లంతుపై స్థానికులు 32వ పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు.
Hyderabad, I am inked. Are you? pic.twitter.com/5Yql0X3l0x
— KTR (@KTRTRS) February 2, 2016
All fellow Hyderabadis, Do vote in this crucial GHMC election; Whatever be thy choice. Remember that every vote counts#LetsVoteHyderabad
— KTR (@KTRTRS) February 1, 2016












Click it and Unblock the Notifications