కాకినాడ, నర్సాపూర్ నుంచి తెలంగాణకు ప్రత్యేక రైళ్లు- హాల్ట్ స్టేషన్లు
Special Trains from Kakinada and Narsapur: రెండు తెలుగు రాష్ట్రాల్లో పండగ సీజన్ మొదలైనట్టే. క్రిస్మస్, కొత్త సంవత్సరం మొదలుకుని సంక్రాంతి ముగిసేంత వరకూ ఈ కోలాహలం కొనసాగుతుంటుంది. ఈ సీజన్ లో రైళ్లకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుంది. దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించాలనుకునే వాళ్ల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంటుంది. వాళ్లంతా కూడా రైళ్ల మీదే ఎక్కువగా ఆధారపడుతుంటారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు పలు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది.
అత్యంత రద్దీ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడిపిస్తోన్నారు. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో గతంలో పట్టాలపైకి తీసుకొచ్చిన పలు సర్వీసులను పొడిగిస్తూ వస్తోన్నారు కూడా. తిరుపతి, బెంగళూరు, చెన్నై, హౌరా, హజ్రత్ నిజాముద్దీన్ వంటి రూట్లల్లో ఇప్పటికే ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటోన్నాయి. అటు శబరిమలకు వెళ్లే అయ్యప్ప స్వాముల కోసం కొల్లం వంటి డెస్టినేషన్లకు ప్రత్యేక రైళ్లు నడుస్తోన్నాయి.

నర్సాపూర్- వికారాబాద్
- ఈ క్రమంలో రద్దీ మార్గాల్లో ఒకటైన కాకినాడ- వికారాబాద్, నర్సాపూర్- వికారాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన వివరాలను విడుదల చేశారు.
- జనవరి 17, 18, 19 తేదీల్లో రాత్రి 8 గంటలకు నర్సాపూర్ నుంచి బయలుదేరే నంబర్ 07257/07259/07215 ప్రత్యేక రైళ్లు మరుసటి రోజు ఉదయం 10 గంటలకు వికారాబాద్ కు చేరుకుంటాయి.
- జనవరి 18, 19, 20వ తేదీల్లో రాత్రి 9:30 గంటలకు వికారాబాద్ నుంచి బయలుదేరే నంబర్ 07258/07260/07266 ప్రత్యేక రైళ్లు మరుసటి రోజు ఉదయం 10 గంటలకు నర్సాపూర్ కు చేరుకుంటాయి.
- పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకవీడు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి, సికింద్రాబాద్, బేగంపేట్, హైటెక్ సిటీ, లింగంపల్లి స్టేషన్ల మీదుగా ఆయా రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.
కాకినాడ- వికారాబాద్
- జనవరి 17, 18, 19 తేదీల్లో సాయంత్రం 6:20 నిమిషాలకు కాకినాడ టౌన్ నుంచి బయలుదేరే నంబర్ 07241/07243/07285 ప్రత్యేక రైళ్లు మరుసటి రోజు ఉదయం 9:45 నిమిషాలకు వికారాబాద్ కు చేరుకుంటాయి.
- జనవరి 18, 19, 20వ తేదీల్లో సాయత్రం 6:55 నిమిషాలకు వికారాబాద్ నుంచి బయలుదేరే నంబర్ 07242/07259/07286 ప్రత్యేక రైళ్లు మరుసటి రోజు ఉదయం 9:20/9:45 నిమిషాలకు కాకినాడకు చేరుకుంటాయి.
- సామర్లకోట, ద్వారపూడి, రాజమండ్రి, ఏలూరు, రాయనపాడు, ఖమ్మం, వరంగల్, ఖాజీపేట్, సికింద్రాబాద్, బేగంపేట్, హైటెక్ సిటీ, లింగంపల్లి స్టేషన్ల మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.












Click it and Unblock the Notifications