సజావుగా సాగుతున్న చివరి దశ పరిషత్ పోలింగ్..

Recommended Video

    తెలంగాణలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ చివరి విడత ఎన్నికల పోలింగ్ ! || Oneindia Telugu

    తెలంగాణలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ చివరి విడత ఎన్నికల పోలింగ్ సజావుగా సాగుతోంది. 27 జిల్లాల్లోని 9,494 పోలింగ్ బూత్‌లలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎండ పెరగక ముందే ఓటు వేసేందు కోసం జనం ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్ల వద్ద బారులు తీరారు.

    మూడో విడతలో 30 ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ స్థానం ఏకగ్రీవం కాగా.. 160 జెడ్పీటీసీ, 1708 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మూడో విడతలో జెడ్పీటీసీ స్థానాల కోసం 741మంది బరిలో ఉండగా.. 5,726మంది ఎంపీటీసీ కోసం పోటీ చేసతున్నారు. తొలి దశలో వాయిదాపడిన సిద్ధిపేట జిల్లా అల్వాల్, రంగారెడ్డి జిల్లాలోని అజీజ్ నగర్ ఎంపీటీసీ స్థానాలకు ఈ రోజు పోలింగ్ నిర్వహిస్తున్నారు.

    Final phase of mptc zptc elections underway in telangana

    పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాలైన మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో సాయంత్రం 4గంటలకే పోలింగ్ ముగియనుంది. మిగతా ప్రాంతాల్లో సాయంత్రం ఐదింటి వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 217న వెలువడనున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+