కాల్ మనీని తలపించేలా!: అప్పు చెల్లించలేదని భార్యను ఎత్తుకెళ్లాడు!

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఏపీలోని విజయవాడలో వెలుగుచూసిన కాల్ మనీ వ్యవహారం.. ఎంతటి కలకలం రేపిందో అందరికీ తెలిసిన సంగతే. అధిక వడ్డీలకు రుణాలిచ్చి.. మహిళలను లైంగికంగా వేధించిన ఈ ఉదంతం అప్పట్లో సంచలనం రేకెత్తించింది. తాజాగా హైదరాబాద్ లోను ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. అంబర్‌పేటకు చెందిన శ్రీనివాస్‌ అనే వ్యక్తి వడ్డీ వ్యాపారి శ్రీనివాస్‌ వద్ద రూ.4లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అయితే అప్పు సకాలంలో చెల్లించలేదన్న కారణంతో శ్రీనివాస్ భార్యను వడ్డీ వ్యాపారి కిడ్నాప్ చేశాడు. దీంతో పోలీసులను ఆశ్రయించిన బాధితుడు వడ్డీ వ్యాపారిపై కేసు నమోదు చేశాడు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.

financier kidnapped borrower for money

కాగా, అప్పు తీర్చలేదన్న కారణంతో.. ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న ఇద్దరు తాత మనువళ్లపై ఇటీవల ఓ వడ్డీ వ్యాపారి పెట్రోల్ పోసి నిప్పటించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బాలుడు మృతి చెందగా.. అది మరిచిపోకముందే మరో వడ్డీ వ్యాపారి ఘాతుకం వెలుగులోకి రావడం గమనార్హం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A financier in Hyderabad was kidnapped a housewife in Amberpet region. Srinivas, who is victims husband was taken borrow from that financier
Please Wait while comments are loading...