అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం: పరుగులు తీశారు
నగరంలోని మెహదీపట్నంలో ఓ అపార్ట్‌మెంట్‌లో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. సరోజినీదేవి కంటి ఆస్పత్రి సమీపంలోని ఉస్మానియా అపార్ట్‌మెంట్‌లోని రెండో అంతస్తులో సోమవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
హైదరాబాద్: నగరంలోని మెహదీపట్నంలో ఓ అపార్ట్‌మెంట్‌లో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. సరోజినీదేవి కంటి ఆస్పత్రి సమీపంలోని ఉస్మానియా అపార్ట్‌మెంట్‌లోని రెండో అంతస్తులో సోమవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

దీంతో అపార్ట్‌మెంట్‌వాసులు తీవ్ర భయాందోళనలకు గురై బయటికి పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మంటల కారణంగా ఆ అపార్ట్‌మెంట్ గదిలోని వస్తువులు కాలిబూడిదయ్యాయి.












Click it and Unblock the Notifications