జీడిమెట్లలో ప్రమాదం, పొగతో ఉక్కిరిబిక్కిరి (పిక్చర్స్)
హైదరాబాద్: షాపూర్ నగర్ సమీపంలోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఆదివారం ఓ రసాయన కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీలోని రసాయన డ్రమ్ములు వంద మీటర్ల ఎత్తుకు ఎగిరిపడ్డాయి.
భారీ పేలుడు శబ్ధానికి స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. చుట్టుప్రక్కల మూడు కిలో మీటర్ల వరకు ఘాటైన పొగ వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
మంటలను అదుపుచేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ఎట్టకేలకు మంటలు అదుపులోకి వచ్చాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

రసాయన కంపెనీ
హైదరాబాదులోని జీడిమెంట్ల పారిశ్రామికవాడలో ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి

రసాయన కంపెనీ
రసాయనాల డ్రమ్ములు పేలడంతో పరిసరాల్లో దట్టమైన పొగ వ్యాపించింది. ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు.

రసాయన కంపెనీ
ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు.. అగ్నిమాపక సిబ్బంది దాదాపు ఐదు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.

రసాయన కంపెనీ
ఈ సంఘటన షాపూర్ నగర్ సమీపంలోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని సుభాష్ నగర్‌లోని ఓ రసాయన పరిశ్రమ గోదాములో జరిగింది.












Click it and Unblock the Notifications