ములుగు జిల్లాలో అగ్నిప్రమాదం: 40ఇళ్ళు దగ్ధం; బాధితులకు అండగా ఉంటామన్న మంత్రి సత్యవతిరాథోడ్
ములుగు జిల్లా శనిగకుంటలో అగ్ని ప్రమాద ఘటన చోటు చేసుకుంది. విపరీతంగా వీచిన గాలి దుమారం తో మంగపేట మండలం కన్నాయిగూడెం, శనిగకుంట గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. సమీపంలో ఉన్న అటవీ ప్రాంతం నుండి గ్రామంలోకి ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఏజెన్సీ గ్రామమైన శనిగకుంటలో సుమారు నలభై ఇళ్ళు అగ్నికి ఆహుతయ్యాయి. గాలి బీభత్సం కారణంగా చెలరేగిన మంటలు ఒక్కసారిగా ఊరంతా వ్యాపించడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఆదివాసీ గిరిజనులు ప్రాణభయంతో పిల్లలను చేతబట్టుకొని పరుగులు తీశారు.
ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రాణ హాని జరగలేదు. అగ్ని ప్రమాదం తో అలర్ట్ అయిన విద్యుత్ శాఖ అధికారులు అక్కడ కరెంటు సరఫరాను నిలిపివేశారు. చిమ్మ చీకట్లో చెలరేగుతున్న మంటలతో హాహాకారాలు చేస్తూ స్థానికులు పరుగులు తీశారు. సంఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది ఆలస్యంగా చేరుకున్నారు. మంటలను ఆర్పి, సహాయక చర్యలు చేపట్టారు. సంఘటనపై అధికారులు సైతం అప్రమత్తం అయ్యారు. నిలువనీడ కోల్పోయిన గిరిజన కుటుంబాలు తమను ఆదుకోవాలని అధికారులను వేడుకుంటున్నారు.

ఇదిలా ఉంటే ములుగు జిల్లా లోని మండపేట మండలం చింతకుంట లో జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ ల తో మాట్లాడిన సత్యవతి రాథోడ్ బాధితులకు అవసరమైన సహాయాన్ని తక్షణం అందించాలని వెల్లడించారు. ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని సత్యవతి రాథోడ్ హామీ ఇచ్చారు. బాధితులు ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించిన సత్యవతి రాథోడ్, బాధితుల కుటుంబాలకు అండగా తాము ఉంటామంటూ పేర్కొన్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications