వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోహిణి ఆసుపత్రిలో అగ్నిప్రమాదం: ఇద్దరు మృతి, పలువురికి గాయాలు

వరంగల్ రోహిణి ఆసుపత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకొంది. షార్ట్ సర్య్కూట్ కారణంగా ఈ ప్రమాదం వాటిల్లిందని సమాచారం. ఆసుపత్రి నుండి 109 మంది రోగులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

వరంగల్: వరంగల్ పట్టణంలోని రోహిణి ఆసుపత్రిలో సోమవారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటుచేసుకొంది.ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.సుమారు 192 మంది రోగులను సురక్షితంగా ఆసుపత్రి నుండి బయటకు తీసుకువచ్చారు.అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలను మాత్రం ఆసుపత్రి వర్గాలు స్పష్టంగా చెప్పలేక పోతున్నాయి.

వరంగల్ రోహిణి ఆసుపత్రిలోని రెండవ ఫ్లోర్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకొంది. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రచారం సాగుతోంది. అయితే ఆసుపత్రిలో గ్యాస్ లీకు కావడం వల్లే ఈ ప్రమాదం వాటిల్లిందని మరికొందరు చెబుతున్నారు.

fire accident in Rohini hospital at Warangal

ఆసుపత్రిలో ఉన్న రోగులను వెంటనే బయటకు తరలించారు. అగ్ని ప్రమాదం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను సమీపంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.సుమారు 192మంది రోగులను ఆసుపత్రి నుండి బయటకు సురక్షితంగా తీసుకు వచ్చారు.అగ్ని ప్రమాదం కారణంగా ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన రోగులు గాయపడ్డారు.

అగ్ని ప్రమాదం విషయం తెలిసిన వెంటనే పోలీసులు, స్థానికులు వెంటనే స్పందించారు.ఆసుపత్రిలోని ప్రతి ఫ్లోర్‌కు వెళ్ళి రోగులను బయటకు తీసుకువచ్చారు.ఈ ఘటనలో కుమారస్వామి, మల్లమ్మ అనే ఇద్దరు రోగులు చనిపోయారని సమాచారం.

ఫైరింజన్లు కూడ వచ్చి ఆసుపత్రిలో మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి.ప్రతి ఫ్లోర్‌కు వెళ్ళి బాధితులను తీసుకువచ్చారు.రోడ్డుపైనే క్షతగాత్రులు స్ట్రైచర్‌పై ఉన్నారు.దీంతో ట్రాఫిక్‌ను మళ్ళించారు.ఆసుపత్రిని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు సందర్శించారు.

English summary
Fire accident in Rohini hospital at Warangal on Monday.109 patients were safely escaped from fire accident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X