తుపాకీ మిస్‌ఫైరా? లేక కాల్పులా?: అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి
అమెరికాలో తుపాకీ మిస్ ఫైర్ కావడంతో తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి మృతి చెందాడు. అయితే, తుపాకీ మిస్ ఫైర్ అయ్యిందన మొదట వార్తలు వచ్చినప్పటికీ.. ఆ తర్వాత తోటి విద్యార్థే తుపాకీతో కాల్చి చంపాడని సమాచారం.
హైదరాబాద్: అమెరికాలో తుపాకీ మిస్ ఫైర్ కావడంతో తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి మృతి చెందాడు. అయితే, తుపాకీ మిస్ ఫైర్ అయ్యిందన మొదట వార్తలు వచ్చినప్పటికీ.. ఆ తర్వాత తోటి విద్యార్థే తుపాకీతో కాల్చి చంపాడని సమాచారం.
ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన మహంకాళి అఖిల్ సాయి అనే విద్యార్థి ఎంఎస్ చదివేందుకు 13 నెలల క్రితం అమెరికా వెళ్లాడు. అలబామాలోని అబర్న్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. అంతేగాక, అక్కడికి సమీపంలోని ఓ గ్యాస్ స్టేషన్‌లో పార్ట్‌టైమ్ జాబ్ కూడా చేస్తున్నాడు.
అమెరికా కాలమానం ప్రకారం.. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో గ్యాస్ స్టేషన్లోని సెక్యూరిటీ గార్డు వద్ద తుపాకీని పరిశీలిస్తున్న క్రమంలో అది మిస్ ఫైర్ అయి.. అఖిల్ సాయి తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడిన అఖిల్ సాయిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అకిల్ మృతి చెందాడు.

అయితే, తాజాగా, వెలుగు చూసిన విషయం ఏంటంటే.. అఖిల్ ను తోటి విద్యార్థే తుపాకీతో కాల్చి చంపాడు. అయితే, అతడు ఎందుకు కాల్పులు జరిపాడని విషయం మాత్రం తెలియరాలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే, ఈ ఘటన జరిగినప్పుడు పక్కనేవున్న 23 ఏళ్ల రవితేజ గోలి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
అఖిల్ మృతి చెందాడనే విషయం తెలుసుకున్న అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అతని మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు సాయం అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. అఖిల్ తల్లిదండ్రులు ప్రస్తుతం హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్నారు.












Click it and Unblock the Notifications