ఏడాది పాలనలో రేవంత్ మార్క్ రికార్డు - ఇదీ లెక్క..!!

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ ఏడాది పాలన పూర్తవుతోంది. కాంగ్రెస్ లో ప్రవేశించిన నాటి నుంచి రేవంత్ సీఎం అయ్యే వరకూ రేవంత్ విశ్రమించలేదు. ముఖ్యమంత్రి అయిన తరువాత తన దైన ముద్ర కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సామాన్యుడికి మేలు చేయాలనే పార్టీ నాయకత్వం ఆదేశంతో నిర్ణయాలు అమలు చేసారు. అటు పార్టీ, ఇటు ప్రభుత్వం సమన్వయం చేసుకుంటూ తన నాయకత్వ సమర్దత నిరూపించారు. హైకమాండ్ అంచనాలు.. తెలంగాణ ప్రజల ఆశలు నెరవేర్చే క్రమంలో రేవంత్ ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ, ఏడాది కాలం లోనే తెలంగాణలో కొత్త రికార్డులు నెలకొల్పారు.

సక్సెస్ రేటు ఎంత
ముఖ్యమంత్రి రేవంత్ ప్రభుత్వ కొలువు తీరి ఏడాది పూర్తవుతోంది. ఈ ఏడాదిలో సీఎం గా రేవంత్ సక్సెస్ రేటు ఎంత అనే చర్చ మొదలైంది. రాజకీయంగానే కాదు..ప్రభుత్వాధినేత గానూ రేవంత్ తన మార్క్ నిరూపించుకున్నారు. మంత్రివర్గ సహచరులు.. తన టీం తో కలిసి కొత్త విజయాలు నమోదు చేసారు. ఏడాది కాలంలో రేవంత్ సాధించిన విజయాలను తెలంగాణ సీఎంఓ అంశాల వారీగా వెల్లడించింది. దేశంలో ఏ రాష్ట్రంలో.. ఎప్పుడూ చేయని విధంగా .. ఆర్దిక కష్టాలు ఉన్నా ఒకే విడతలో రూ 2 లక్షల వరకు రుణ మాఫీ చేసి కొత్త రికార్డు నెలకొల్పారు. అదే విధంగా దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత అతి తక్కువ సమయంలో అధిక సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత రేవంత్ ప్రభుత్వానికే దక్కింది.

First-Year Report Card Revanth Reddys Promises turn into Achievements

హైదరాబాద్ బ్రాండ్ పెంచేలా
రేవంత్ పాలనలో సన్నాలు పండించిన రైతులకు బోనస్ అందిస్తున్నారు. 1947 నుంచి ఏ రాష్ట్రం లోనూ లేని విధంగా తెలంగాణలో రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి జరిగింది. రాష్ట్రంలో ఆక్రమణలకు గురవుతూ వస్తున్న సరస్సుల పునరుద్దరణ మొదలైంది. 40 ఏళ్ల తరువాత ఆక్రమణలు నిలిచిపోయాయి. ఎంతో ఘన చరిత్ర ఉన్నా నాటి పాలకు నిర్లక్ష్యంతో కలుషితమై .. నిరుపయోగంగా మారిన మూసీ నదిని 50 సంవత్సరాల తరువాత రేవంత్ పాలనలో కొత్త శోభ సంతరించుకుంటోంది. క్లైమేట్ క్రైసిస్ సవాళ్లను ఎదుర్కోవడానికి.. రాబోయే 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా అద్బుతమైన నగరంగా హైదరాబాద్ స్థిరమైన వృద్ధి సాధించేలా రేవంత్ పక్కా ప్రణాళికా బద్దంగా అడుగులు వేస్తున్నారు. దేశంలోనే తొలి సారిగా స్కిల్ యూనివర్సిటీని రేవంత్ ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద క్రీడా విశ్వవిద్యాలయం రేవంత్ నాయకత్వంలో ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి.

గ్యారెంటీల అమలు
ప్రజలకు ఇచ్చిన హామీల అమలు లోనూ రేవంత్ ముందు వరుసలో నిలిచారు. ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీల అమలుకు శ్రీకారం చుట్టారు. మహిళలకు ఉచిత బస్సు, రూ. 500 వంట గ్యాస్ సిలిండర్లు, 200 యూనిట్ల కంటే తక్కువ వినియోగం ఉన్న ఇళ్లకు ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా అవుతోంది. హైదరాబాద్ లో కాలు ష్యం తగ్గించేందుకు నగరంలోని అన్ని పెట్రోల్, డీజిల్ బస్సులను పూర్తిగా తొలగించి..వాటి స్థానంలో 3,000 ప్లస్ ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశ పెడుతున్నారు. అదే విధంగా నగరంలోని బాపూ ఘాట్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. ⁠హైదరాబాద్ నగర ప్రజల అవసరాలకు గోదావరి నుంచి తాగునీరు అందిస్తున్నారు. హైదరాబాద్ ఖ్యాతి మరింత పెంచేలా హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ కు ధీటుగా నాలుగో నగరం గా ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ సిద్దం అవుతోంది. రాష్ట్రంలో పదేళ్లు నిర్లక్ష్యానికి గురైన రెసిడెన్షియల్ పాఠశాల పిల్లలకు రేవంత్ ప్రభుత్వంలో ఆహారం కాస్మోటిక్ బడ్జెట్‌లు పెరిగాయి.

భవిష్యత్ కోసం నిర్ణయాలు
మహిళలకు రేవంత్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అండగా నిలుస్తున్నారు. కోటి మంది మహిళా కోటీశ్వరులను సృష్టించేందుకు స్వయం సహాయక మహిళా సంఘాలను..మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చి దిద్దేందుకు రుణాలు అందిస్తున్నారు. రాష్ట్రలో సర్వే నిర్వహిస్తూ రాష్ట్రంలో ప్రతీ ఒక్కరి అభ్యున్నతి దిశగా అడగులు వేస్తున్నారు. రెసిడెన్షియన్ పాఠశాలల నిర్వ హణ లో సంస్కరణలు ప్రవేశ పెట్టారు. దళిత, గిరిజన, ఓబీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ స్థాయి సౌకర్యాలతో కొత్త క్యాంపస్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. అవినీతికి చిరునామాగా మారిన ధరణి పోర్టల్ సంస్కరణ బాధ్యతలు ఎన్ఐసీకి అప్పగించారు. ముఖ్యమంత్రి అంటే సేవకుడు మాత్రమే అనేలా.. గత పాలకులకు భిన్నంగా సామాన్యులు కలిసే అవకాశం కల్పించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సామాన్యులు వెళ్లే వెసులుబాటు కల్పించారు.

First-Year Report Card Revanth Reddys Promises turn into Achievements

గతం కంటే భిన్నంగా
తెలంగాణ రాష్ట్రంలో మీడియా స్వేచ్ఛ పునరుద్ధరించారు. వార్తల పైన నియంత్రణ, బెదిరింపు లకు కాలం చెల్లింది. డ్రగ్స్ పైన రేవంత్ సర్కార్ యుద్దం ప్రకటించింది. భవిష్యత్ వర్గాల కోసం డ్రగ్స్ విషయంలో రాజీ లేని విధంగా కఠినంగా వ్యవహరిస్తోంది. ఏడాది కాలంలోనే అధిక మొత్తం లో పెట్టుబడులు వచ్చాయి. రీజనల్ రింగ్ రోడ్, రైలు ప్రాజెక్టులు తెలంగాణకు దక్కాయి. రేవంత్ మెట్రో రైలు విస్తరణ తదుపరి దశ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రంలోని టైర్ -2 పట్టణా ల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు అవుతున్నాయి. వరంగల్ ను రెండో రాజధానిగా తీర్చి దిద్దే క్రమంలో భారీగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. పేదలకు ఇల్లు అందించే లక్ష్యంతో నాలుగు లక్షల ఇందిరమ్మ ఇళ్లకు ఆమోదం తెలిపారు.

ప్రతిష్ఠ పెంచేలా
పేదవాడి ఆరోగ్యం కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి వ్యక్తికి రూ. 10 లక్షల విలువైన యూనివర్సల్ హెల్త్‌కేర్ అమలవుతోంది. సామాన్యుల నుంచి వస్తున్న ప్రజా వాణి వినతుల్లో లో 5 లక్షల ప్రజా సమస్యల పరిష్కారం అయ్యాయి. ఇక, ప్రతి నెల మొదటి తేదీన ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల చెల్లింపు కొనసాగుతోంది. తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణకు రంగం సిద్దం అవుతోంది. త్వరలోనే విగ్రహావిష్కరణ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నారు. ఈ విగ్రహం రాష్ట్ర గౌరవం, సంస్కృతి, మరియు సంప్రదాయాలను ప్రతిబింబించేలా రూపు దిద్దుకుంటోంది. అదే విధంగా తెలంగాణకు ప్రత్యేక గీతం సిద్దం అవుతోంది. తెలంగాణ రాష్ట్ర స్ఫూర్తిని, గొప్పతనాన్ని, ప్రజల ఐక్యతను పునరుద్ఘాటించేలా కొత్త తెలంగాణ గీతం రూపొందిస్తున్నారు. ఈ గీతం ద్వారా రాష్ట్ర స్వాభిమానాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా కనిపిస్తోంది. తెలంగాణ ప్రతిష్ఠ పెంచేలా రాష్ట్ర గౌరవానికి ప్రతీకగా TG రూపాన్ని చిహ్నంగా ఎంపిక చేసారు.

ఇక, నిత్యం 18 గంటలు పని చేసే ముఖ్యమంత్రిగా రేవంత్ గుర్తింపు పొందారు. ప్రజా సమస్యల ను శ్రద్దగా వింటూ.. పాలనలో మెరుగుదల లక్ష్యంగా ప్రజాభిప్రాయసేకరణ చేస్తూ.. ప్రజా పాలన అందిస్తుండటంతో తెలంగాణలో ప్రతీ ఒక్కరికీ భవిష్యత్ పైన నమ్మకం కలిగించటంలో సీఎం గా రేవంత్ తొలి ఏడాది సక్సెస్ గా నిలిచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+