కాళ్లు పట్టుకున్న కామాంధుడు మధు, వదిలేసిన యువతి: రెచ్చిపోయాడు
హైదరాబాద్: యువతులను లైంగికంగా వేధించి, మోసగించిన కామాంధుడు మధు.. గతంలో ఓ బాధితురాలు జాలితో దయతలిచి వదిలేసింది. ఆమె కనుక కోర్టులో మధుకు బలంగా వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే.. ఎప్పుడో జైలు పాలు అయ్యేవాడు. పోలీసుల దర్యాఫ్తులో ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి.
మధు మోసానికి గురైన ఓ యువతి.. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని కుషాయిగూడ పోలీసులకు గత ఏడాది ఏప్రిల్ నెలలో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నోదు చేసి దర్యాఫ్తు చేస్తామని చెబితే... సాక్ష్యాధారాలతో పట్టించేందుకు ఆమె సిద్ధపడింది.
తన సోదరుడితో కలిసి ప్లాన్ వేసింది. పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చింది. సోదరుడు, పోలీసులను బయట ఉండమని చెప్పి మధు ఉన్నచోటుకు వెళ్లింది. అనుమానం రాకుండా బయట సోదరుడికి ఫోన్ చేసింది. పోలీసులు, ఆమె సోదరుడితో పాటు వచ్చి మధును అరెస్టు చేశారు. జైలుకు తరలించారు.

అయితే, కేసు విచారణ వచ్చాక కోర్టులో సాక్ష్యం చెప్పేందుకు యువతి వచ్చింది. కోర్టు బయట మధు.. ఆ యువతి కాళ్లు పట్టుకొని, తనకు బుద్ధి వచ్చిందని, జీవితంలో ఎప్పుడూ తప్పుచేయనని కోరడంతో ఆమె జాలిపడి.. కోర్టులో బలంగా చెప్పలేదని తెలుస్తోంది. ఆ తర్వాత అతను మరింత రెచ్చిపోయాడు.
కాగా, వందలాది మందిని మోసగించిన కామాంధుడు మధును ఐదో రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు మంగళవారం నాడు ఉత్తర్వులు ఇచ్చింది. అక్టోబర్ 28వ తేదీ నుంచి నవంబర్ 1వ తేదీ వరకు అతడిని విచారించి, అనంతరం చంచల్ గూడ జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది.












Click it and Unblock the Notifications