ఢీకొట్టుకున్న బస్సు, కారు: ఐదుగురు దుర్మరణం, కారు నుజ్జు నుజ్జు
సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది కందిలోని ఐఐటి హైదరాబాదు క్యాంపస్ వద్ద బస్సు, కారు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు.
జహీరాబాద్ నుంచి పటాన్‌చెరు వెళ్తున్న బస్సును వేగంగా వేగంగా వెళ్తూ డివైడర్‌ను దాటి కారు ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు మరణించారు.

కారును ఢీకొట్టిన తర్వాత బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది దీంతో బస్సు ప్రయాణికుల్లో పలువురు గాయపడ్డారు. మృతులు ఓ ప్రెస్ యజమాని అతని సహాయకులుగా తెలుస్తోంది. మృతులను వెంకట్ రెడ్డి, మహేశ్వర్, నాగరాజు, నరేందర్, వెంకట్‌లుగా గుర్తించారు. వారు సంగారెడ్డి పట్టణానికి చెందినవారు.
ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జయింది. బస్సు కూడా ధ్వంసమైంద. కారులో చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీయడానికి పోలసులు ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications