తప్పతాగి డ్రైవింగ్ చేసిన సిఐ: 5గురికి గాయాలు, చితకబాదిన స్థానికులు
మేడ్చల్: పుల్‌గా మధ్యం తాగి అడ్డగోలుగా కారును నడిపి ఐదుగురిని గాయపర్చిన రాచకొండ పరిధిలోని సిఐ గిరీష్‌రావును స్థానికులు చితకబాదారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకొంది.
మద్యం తాగి కారును నడిపి ఐదుగురిని గాయపర్చిన సిఐ గిరీష్‌రావును స్థానికులు చితకబాదారు. ఈ విషయమై మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు రావడంతో రాచకొండ సీపీ మహేష్ భగవత్ సిఐ గిరిష్ రావుపై కేసు నమోదు చేశారు.
మేడ్చల్ పిటిఐలో సిఐగా పనిచేస్తున్నగిరిష్ రావు అనే సిఐ సోమవారం రాత్రి మద్యం తాగి ఇన్నోవా వాహనాన్ని ఇష్టం వచ్చినట్టు నడిపాడు. జవహర్‌నగర్ పరిధిలో ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొట్టాడు.

రెండు ద్విచక్రవాహనాలు, ఓ కారును ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. స్థానికులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన గిరీష్ రావు తాను పోలీస్ అధికారినంటూ వీరంగం వేశాడు. దీంతో స్థానికులు ఆయనను కట్టేసి చితకబాదారు.
ఈ విషయమై మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు రావడంతో రాచకొండ సీపీ మహేష్ భగవత్ సిఐ గిరీష్ రావుపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.ఈ ఆదేశాల మేరకు గిరీష్ రావుపై కేసులు నమోదు చేశారు.
మద్యం మత్తులో ఉన్న గిరీష్ రావుకు బ్రీత్ ఎనలైజ్ టెస్ట్ చేస్తే 239 పాయింట్లుగా నమోదైంది.30 పాయింట్లు దాటితేనే తీవ్రమైన కేసులుంటాయి. కానీ, సిఐగా విధులు నిర్వహిస్తున్న గిరీష్ రావు మద్యం తాగి ఐదుగురిని గాయపర్చారు.












Click it and Unblock the Notifications