హోలీ విషాదం: వేర్వేరు ఘటనల్లో నీట మునిగి ఐదుగురు మృతి
హోలీ పండుగ సందర్భంగా వరంగల్, జనగామ జిల్లాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వేర్వేరు ఘటనల్లో ఐదుగురు నీట మునిగి చనిపోయారు.
వరంగల్: హోలీ పండుగ సందర్భంగా వరంగల్, జనగామ జిల్లాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వేర్వేరు ఘటనల్లో ఐదుగురు నీట మునిగి చనిపోయారు. నర్మెట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జనగామకు చెందిన క్రాంతి, నాగరాజులు ఈత కోసం బొమ్మకూరు రిజర్వాయర్‌కు వెళ్లారు.
ఈత కొడుతుండగా వారు నీట మునిగి మృతి చెందారు. వీరిద్దరు క్రీస్తుజ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నారు.

మరో సంఘటనలో, కురవి మండలంలోని అయ్యగారిపల్లె గ్రామంలో పెద్దచెరువు నీటి ట్యాంకులో మునిగి ఇద్దరు మృతి చెందారు. కురవి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఇద్దరు బాలురు హోలీ ఆడారు.
హోలీ అనంతరం వారు స్నానం కోసం వెళ్లారు. అక్కడ నీటిలో మునిగి మృతి చెందారు. మృతి చెందిన వారిని వీరేంధర్ (10), చరణ్(9)లుగా గుర్తించారు.
ఇంకో సంఘటనలో తొర్రూరు మండలంలోని ఫతేపూర్ గ్రామంలో నరేష్ (20) అనే వ్యక్తి ట్యాంకులో మునిగాడు. తొర్రూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అతను హోలీ అడిన అనంతరం స్నానానికి వెళ్లి నీట మునిగి చనిపోయాడు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications