Mallareddy: మంత్రి మల్లన్నకు కష్టాలు..! ఇక్కడ ప్లెక్సీల లొల్లి, అక్కడ ఎమ్మెల్యేల భేటీ..
తెలంగాణ పట్ల తెలంగాణ తీరుకు నిరసనగా అన్ని జిల్లా కేంద్రాల్లో బీఆర్ఎస్ ధర్నా కార్యక్రమాలు నిర్వహించింది. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ కార్యక్రమాలకు అనుసంధానం చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పదుల సార్లు ఈ విషయంపై విజ్ఞప్తి చేసిన కేంద్రం స్పందించడం లేదన్నారు.

ప్లెక్సీలు
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్ష వైఖరికి నిరసనగా మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి అనుచరులు ప్లెక్సీలు కట్టారు. ప్రస్తుతం ఈ ప్లెక్సీల విషయం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాఫిక్ గా మారింది. మల్లారెడ్డి అనుచరులు పెట్టిన ప్లెక్సీల్లో కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు మద్దతుగా అంటూ ఉంది. ఈ ప్లెక్సీ చూసినవారందరూ ఆశ్చర్యపోతున్నారు.

మేడ్చల్ నియోజకవర్గం
కేంద్రానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ధర్నా చేస్తున్న తరుణంలో మల్లారెడ్డి కేంద్ర విధానాలకు మద్దతు తెలుపుతున్నట్లు ఫ్లెక్సీల్లో రాయించడంపై స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఈ ప్లెక్సీలను భారీగా కట్టారు. అయితే కొంత సమయం తర్వాత తప్పును గ్రహించిన మల్లారెడ్డి అనుచరులు ప్లెక్సీలను తొలగించారు.

ఐటీ సోదాలు
అప్పటికే ప్లెక్సీలను ఫొటోలు తీసిన పలువురు వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. కొద్ది రోజుల క్రితం మల్లారెడ్డికి చెందిన అనేక సంస్థల్లో ఐటీ సోదాలు చేసింది. ఆ తర్వాత వారిని విచారణ కూడా చేసింది. ఆ తర్వాత మేడ్చల్ జిల్లాలో మంత్రి ఇష్టానుసారం వ్యవహారిస్తున్నారని జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యేలు
మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు ఇంట్లో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, కుత్బుల్లాపుర్ ఎమ్మెల్యే వివేక్, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఉప్పల్ ఎమ్మెల్యే బి.సుభాష్ రెడ్డి భేటీ అయ్యారు. మేడ్చల్‌కు మాత్రమే ఆయన మంత్రి కాదన్నారు.కష్టపడిన వారికి గుర్తింపు ఇవ్వడం లేదన్నారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాల వల్ల బీఆర్‌ఎస్ కేడర్‌లో నమ్మకం పోతోందని చెప్పారు.

తిరుమల కొండపై
తాజాగా వీరు మరోసారి తిరుమల కొండపై భేటీ అయ్యారు. మేడ్చల్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే బండ ప్రకాష్ గౌడ్, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద తిరుమలకు వెళ్లారు. వీరంతా హైదరాబాద్ నుంచి తిరుమలకు కలిసివెళ్లినట్లు తెలుస్తోంది. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఈ ఐదుగురు కొండపై మరోసారి భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications