ఇకపై ఎయిర్ పోర్ట్ లలో ప్రయాణం చాలా ఈజీ.. వాటిపై నో స్టాంపింగ్!

విమానయానం చేసేవారికి శుభవార్త. భారత్ నుంచి విదేశాలకు వెళ్లే అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం నిజంగానే గుడ్ న్యూస్ చెప్పింది. విమానాశ్రయాల్లో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను సులభతరం, వేగవంతం చేసేందుకు నిర్ణయం తీసుకుంది, అందులో భాగంగా బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి ఇమ్మిగ్రేషన్ కౌంటర్ల వద్ద బోర్డింగ్ పాస్‌లపై స్టాంప్ వేసే పద్ధతిని పూర్తిగా నిలిపివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.

బోర్డింగ్ పాస్ పై నో స్టాంపింగ్

కొత్త విధానం ప్రకారం బోర్డింగ్ పాస్ పై స్టాంప్ వేసే పద్ధతికి స్వస్తి చెప్పనుంది. ఈ విధానంలో ప్రయాణికులు ఇకపై కాగితం బోర్డింగ్ పాస్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. స్మార్ట్‌ఫోన్‌లోని డిజిటల్ లేదా ఈ-బోర్డింగ్ పాస్‌ను చూపించి క్లియరెన్స్ పొందేలా ప్రాసెస్ ఈజీ చేసింది.

flights boarding pass stamping From September 1 Bureau of Immigration will stop stamping boarding passes for international passengers

స్టాంపింగ్ తో ప్రయాణికుల ఇబ్బందులు

ప్రింటెడ్ బోర్డింగ్ పాస్ తీసుకెళ్లినా అధికారులు దాన్ని పరిశీలిస్తారు తప్ప స్టాంప్ వేయరు. గతంలో స్టాంప్ సరిగ్గా పడకపోవడం లేదా వివరాలు కనిపించకుండా ముద్ర పడటం వంటి కారణాలతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లో చాలా ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యలను తొలగించి సమయం ఆదా చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటికే బోర్డింగ్ పాస్ స్టాంపింగ్ ఆపేసిన సీఐఎస్‌ఎఫ్

ఇంతకు ముందే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సీఐఎస్‌ఎఫ్ దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులకు సెక్యూరిటీ చెకింగ్ సమయంలో బోర్డింగ్ పాస్ స్టాంపింగ్‌ను ఆపేసింది. కేవలం అంతర్జాతీయ ప్రయాణికులకు ఇమ్మిగ్రేషన్ వద్ద మాత్రమే ఈ నిబంధన కొనసాగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు అది కూడా సెప్టెంబర్ 1 నుంచి పూర్తిగా రద్దు కానుంది.

సచివాలయ సోలార్ కార్ పార్కింగ్ .. పనుల పూర్తికి డెడ్ లైన్ ఇదే!
సచివాలయ సోలార్ కార్ పార్కింగ్ .. పనుల పూర్తికి డెడ్ లైన్ ఇదే!

పాస్‌పోర్టులపై ఎంట్రీ, ఎగ్జిట్ స్టాంపులు వేసే విధానం తొలగింపుకు పైలెట్ ప్రాజెక్ట్

అదనంగా భారత పౌరుల పాస్‌పోర్టులపై ఎంట్రీ, ఎగ్జిట్ స్టాంపులు వేసే విధానాన్ని తొలగించేందుకు పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించాలని బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ యోచిస్తోంది. ఇది విజయవంతమైతే భవిష్యత్తులో దేశవ్యాప్తంగా పాస్‌పోర్ట్ స్టాంపింగ్ కూడా ఆగిపోయే అవకాశం ఉంది. ఈ మార్పులు ప్రయాణికులకు బిగ్ రిలీఫ్ ఇస్తాయని చెప్పొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+