కేసీఆర్ సూపర్, ఆయనను చూసి చేయండి: జయలలితకు సూచన

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్/చెన్నై: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చటంద్రశేఖర రావు ప్రవేశ పెడుతున్న పథకాలు చాలా బాగున్నాయని, దానిని అనుసరించాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఆ రా్ట్ర పాట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే) అధినేత రామ్‌దాసు సూచించారు.

Follow Telangana CM KCR: ramdoss to CM Jayalalithaa

అభివృద్ధి, సంక్షేమ పథకాలలో తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తెలంగాణలో కేసీఆర్ అవినీతికి అడ్డుకట్ట వేసి రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించారని, ఇటీవల ప్రదానమంత్రి దేశంలోని ముఖ్యమంత్రుల పని తీరు పైన తెప్పించుకున్న నిఘా వర్గాల సర్వే ప్రకారం కేసీఆర్ మొదటి స్థానంలో నిలిచారని గుర్తు చేశారు.

తక్షణం ఆపండి: బాబుకు జయలలిత లేఖ, 'పార్టీ మూసే ఆలోచనలో జగన్'
ఆయన చేపట్టిన పథకాలు, అవినీతిరహిత పాలన వల్లే ఆయనకు మొదటి స్థానం వచ్చిందని చెప్పారు.య రూ.40వేల కోట్లతో మిషన్ భగీరథను చేపడుతూ, ప్రజలకు తాగునీటిని అందించేందుకు కృషి చేస్తున్నారన్నారు. మిషన్ కాకతీయతో చెరువులను అభివృద్ధి పరుస్తున్నారని గుర్తు చేశారు. తమిళనాడులో సాగునీటి పథకాలు బాగా లేవని, కేసీఆర్ బాటలో నడవాలని జయలలితకు సూచించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
PMK chief Ramdoss has suggested CM Jayalalithaa to follow Telangana Chief Minister KCR on water projects.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X