'రేవంత్‌ను ఫుట్‌బాల్ ఆడుతారు.. జానా, ఉత్తమ్ తప్ప అంతా బీజేపీలోకి రావచ్చేమో!'
రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో ఫుట్‌బాల్ ఆడతారని ఆయన వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: టీడీపీలో అంతా తానై వ్యవహరించిన రేవంత్ రెడ్డి.. మహా సముద్రం లాంటి కాంగ్రెస్ లో అంతటి ప్రాధాన్యతను పొందగలుగుతారా? అన్నది ప్రస్తుతానికి ఎవరూ చెప్పలేనిది.
Recommended Video

ఇతర పార్టీల నేతలు సైతం అదంత సులువుగా సాధ్యమయ్యే పని కాదని తేల్చేస్తున్నారు. తాజాగా సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు సంకినేని వెంకటేశ్వరరావు దీనిపై స్పందించారు. రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో ఫుట్‌బాల్ ఆడతారని ఆయన వ్యాఖ్యానించారు.

గురువారం అసెంబ్లీ ఆవరణలో మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు.రాజకీయాలంటేనే ఊహల్లో ముందుకెళ్ళడం సహజమన్నారు. కానీ నేటి రోజుల్లో పార్టీలకు సిద్ధాంతాలంటూ లేవని అన్నారు. ఉన్న పార్టీల్లో కొంతవరకు మంచి పార్టీలు ఎంచుకోవాలని సూచించారు.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేదని, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలే ఉన్నాయని గుర్తుచేశారు.గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ నేతలు కూడా తమ వైపు వస్తారని జోస్యం చెప్పారు. ఇప్పటికే టీఆర్ఎస్ నేత డి.శ్రీనివాస్ తనయుడు తమ పార్టీలో చేరారని అన్నారు.
కాంగ్రెస్ ముఖ్య వారసుల నేతలంతా భవిష్యత్తులో బీజేపీ వస్తారని సంకినేని అన్నారు. జానారెడ్డి, ఉత్తమ్ మినహా కోమటిరెడ్డి బ్రదర్స్‌తో పాటు కాంగ్రెస్‌లో మిగిలిన బలమైన నేతలు బీజేపీలోకి రావచ్చేమోనని అన్నారు. అదే జరిగితే రాష్ట్రంలో అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయం అవుతామని వెంకటేశ్వరరావు అన్నారు.












Click it and Unblock the Notifications