Tamilisai Soundararajan: హైదరాబాద్ కు చేరుకున్న తమిళిసై సౌందర రాజన్..

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హైదరాబాద్ చేరుకున్నారు. ఆమె లోక్ ఎన్నికల్లో పోటీ చేయడానికి గవర్నర్ పదవికి రాజీనామా చేసి వెళ్లారు. చెన్నై (దక్షిణ) లోక్‌సభ నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్థిగా తమిళిసై పోటీ చేశారు. తమిళనాడులో పోలింగ్ ముగియడంతో ఆమె సోమవారం తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి ఆమె హైదరాబాద్ కు వచ్చారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకున్న ఆమెకు బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

తమిళిసై సౌందరరాజన్ బీజేపీ కార్యాలయానికి వెళ్లారు. సాయంత్రం హైదరాబాద్ లో బీజేపీ తరుఫున ఆమె ప్రచారం చేయనున్నారు. హైదరాబాద్‌లో పది రోజుల పాటు పర్యటించారు. తమిళిసై తెలంగాణ గవర్నర్ గా పని చేసినప్పుడు చాలా సేవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో ప్రజలకు దగ్గరయ్యారు. దీంతో ఆమె ప్రచారం చేయిస్తే కలిస్తొందని భావించిన బీజేపీ పెద్దలు.. ప్రచారం చేయడానికి ఆహ్వానించారు. దీంతో ఆమె బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి హైదరాబాద్ కు వచ్చారు.

Former Governor Tamil Sai Soundara Rajan came to Hyderabad

రాష్ట్రంలో బీజేపీ దూకుడుగా ప్రచారం నిర్వహిస్తూ పలువురు ప్రముఖ అభ్యర్థులను బరిలోకి దింపిన సంగతి తెలిసిందే. మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్ పోటీ చేస్తున్నారు. మరోవైపు నామినేషన్ల ఉపసంహరణ నేటితో ముగిసింది. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు మే 13 పోలింగ్ జరగనుంది. ఇక దేశవ్యాప్తంగా జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+