తెలంగాణలో కొత్తగా 114 కరోనా కేసులు: 1625కు చేరిన యాక్టివ్ కేసులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన నమూనా పరీక్షల్లో కొత్తగా 114 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,97,712కి చేరింది. ఈ మేరకు వివరాలను వైద్యా ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం వెల్లడించింది.

ఆదివారం కరోనా బారినపడి ఒకరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 1,625కు చేరింది. ఆదివారం కరోనా బారి నుంచి 143 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయపడ్డవారి సంఖ్య 2,94,386కి చేరింది.

114 new corona cases reported in Telangana: One death in last 24 hours.

రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1701కు చేరింది. వీరిలో 645 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 24 కరోనా కేసులు నమోదయ్యాయి.

మరోవైపు, దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. వరుసగా రెండో రోజూ 14 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 14,199 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,05,850కి చేరింది. ఇందులో 1,06,99,410 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు.

Recommended Video

    #Coronavirus In TS : కరీంనగర్ జిల్లా చేగుర్తిలో ఒకేసారి 33 మందికి కరోనా... అప్రమత్తమైన అధికారులు!!

    ప్రస్తుతం దేశంలో 1,50,055 యాక్టివ్‌ కేసులున్నాయి. మరో 1,56,385 మహమ్మారి వల్ల మరణించారు. కాగా, గత 24 గంటల్లో 9,695 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా వల్ల మరో 83 మంది మృతి చెందారని వెల్లడించింది. కాగా, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,11,16,854 మంది కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారని తెలిపింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+