వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అధికార దుర్వినియోగం: భాస్కర్ రావుకు కోర్టు బెయిల్

తనపై దాఖలు చేసిన చార్జిషీట్‌ను కొట్టేయాలని జస్టిస్ భాస్కర్ రావు పెట్టుకున్న పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆయన ప్రత్యేక కోర్టు ముందు హాజరై బెయిల్ పొందారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక మాజీ లోకాయుక్త జస్టిస్ భాస్కర్ రావుకు లోకాయుక్త ప్రత్యేక కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. అధికార దుర్వియోగానికి పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. తనపై చార్జిషీట్‌ను కొట్టేయాలని భాస్కర్ రావు కోర్టుకు విన్నవించారు ఆయన పిటిషన్‌ను కొట్టేయడానికి హైకోర్టు తిరస్కరించింది.

తనపై దాఖలు చేసిన చార్జిషీట్‌ను కొట్టేయాలనే పెట్టుకున్న పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది. దాంతో ఆయన మాయో హాల్‌‌లోని ప్రత్యేక హైకోర్టు ముందు హాజరయ్యారు. భాస్కర్ రావుకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.

Former Karnataka Lokayukta Justice Rao gets bail

దాంతో కోర్టు ఆయనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ భాస్కర్ రావు కుమారుడు ఆయన అధికారాన్ని అడ్డంపెట్టుకుని డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం దాఖలు చేసిన చార్జిషీట్‌లో భాస్కర్ రావును నాలుగో నిందితుడిగా పేర్కొన్నారు.

భాస్కర్ రావు కుమారుడు అశ్విన్ రావు, అప్పటి లోకాయుక్త పిఆర్వో సయ్యద్ రియాజ్ ఈ కేసులో ప్రధాన నిందితులు. జస్టిస్ భాస్కర్ రావు తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు.

English summary
The Lokayukta special court on Monday granted bail to Former Lokayukta Justice Bhaskar Rao. Justice Rao is accused of misusing his official powers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X