కేటీఆర్‌తో ఉద్ధవ్ థాకరే కుమారుడు భేటీ: మారిన ఈక్వేషన్లు

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని భారత్ రాష్ట్ర సమితి క్రమంగా తన కార్యకలాపాలను విస్తరించుకుంటోంది. ఇప్పటికే ఏపీలో అడుగు పెట్టింది. అనంతరం అటు మహారాష్ట్రలో ఎంట్రీ ఇచ్చింది. నాందెడ్‌లో బహిరంగ సభను నిర్వహించడం ద్వారా అక్కడి రాజకీయాలకు కేంద్రబిందువుగా నిలిచింది. మహారాష్ట్రకు చెందిన కొందరు సీనియర్ నాయకులకు కీలక పదవుల్లో నియమించింది కూడా.

కేసీఆర్ పూర్తి స్థాయిలో జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. కేసీఆర్- దేశ రాజధానిలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని సైతం ప్రారంభించారు. పొరుగు రాష్ట్రాలపైనా పార్టీని విస్తరించడంపై దృష్టి సారించారు. ఊహించిన దాని కంటే వేగంగా ఏపీలో అడుగు పెట్టింది బీఆర్ఎస్. జనసేన పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులను పార్టీలోకి చేర్చుకుంది. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు తదితరులు బీఆర్ఎస్‌లో చేరారు.

ktradityathackeray

మహారాష్ట్రపైనా దృష్టి సారించారు కేసీఆర్. ఇప్పటికే తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లోని నాందెడ్ లో పెద్ద ఎత్తున బహిరంగ సభను నిర్వహించారు. మహారాష్ట్రలో రాజకీయ శూన్యత ఏర్పడిందనేది బీఆర్ఎస్ నాయకుల అభిప్రాయం. ఉద్ధవ్ థాకరే సారథ్యంలో ఇదివరకు అధికారంలో ఉన్న శివసేన-కాంగ్రెస్-నేషనలిస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ కుప్పకూల్చిన తరువాత పరిస్థితులు రాజకీయ శూన్యతకు దారి తీశాయని భావిస్తోన్నారు.

ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన- బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రాబోదనే అంచనాలో ఉంది. అదే సమయంలో ఉద్ధవ్ థాకరేకు చెందిన శివసేన కూడా ఒంటరిగా అధికారంలోకి రాబోదని అంచనా వేస్తోంది. ఈ పరిణామాలను సొమ్ము చేసుకునే దిశగా కేసీఆర్ భవిష్యత్ ప్రణాళికను రూపొందించుకున్నారు. దీనికి అనుగుణంగా ఆయన శరవేగంగా మహారాష్ట్రలో రాజకీయ పార్టీని విస్తరించుకోవడానికి అధిక ప్రాధాన్యత ఇస్తోన్నారు.

ktradityathackeray

ఈ పరిణామాల మధ్య మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కుమారుడు, మాజీ మంత్రి ఆదిత్య థాకరే హైదరాబాద్‌కు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌తో సమావేశం అయ్యారు. టీ-హబ్‌లో ఈ భేటీ ఏర్పాటైంది. పలు అంశాలపై వారు చర్చించారు. స్టార్టప్‌ల ఏర్పాటు, పరిశ్రమలు స్థాపన, ఐటీ రంగానికి తమ ప్రభుత్వం ఇస్తోన్న ప్రాధాన్యతను కేటీఆర్ ఈ సందర్భంగా ఆదిత్య థాకరేకు వివరించారు.

మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం)తో పొత్తు పెట్టుకోవాల్సి రావొచ్చనేది బీఆర్ఎస్ నాయకుల అంచనా. భావసారూప్యం గల పార్టీలను కలుపుకొని వెళ్లాలని ఇదివరకే ఉద్ధవ్ థాకరే నిర్ణయించిన నేపథ్యంలో బీఆర్ఎస్‌తో పొత్తు కోసం ప్రయత్నాలు సాగించే అవకాశాలు లేకపోలేదు. ఆయా పరిణామాలన్నింటిపైనా కేటీఆర్-ఆదిత్య థాకరే ప్రాథమికంగా చర్చించినట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+