అంతా వాళ్లే: ఎమ్మెల్సీ పల్లా గుండెపై వాలి బోరున విలపించిన మాజీ ఎమ్మెల్యే
వరంగల్: స్టేషన్ ఘనపూర్‌లోని తన నియోజకవర్గం వాళ్లే తనను మోసం చేశారని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ తాజా మాజీ ఎమ్మెల్యే టీ రాజయ్య కంటతడి పెట్టుకున్నారు. శిష్యులు గురువును మోసం చేసినట్లుగా తనను అదే పద్ధతిలో తన వాళ్లు అన్యాయం చేశారన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్‌లో కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజయ్య తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు.

అదే సమయంలో అక్కడకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వచ్చారు. ఆయన కారులో నుంచి దిగి వచ్చారు. ఆయన దగ్గరకు రాగానే రాజయ్య.. పల్లా గుండెపై వాలిపోయి బోరున విలపించారు. ఆయనను పల్లా రాజేశ్వర్ రెడ్డి ఊరడించారు. టిక్కెట్ విషయంలో ఎలాంటి ముప్పు లేదని, భయపడవద్దని ధైర్యం చెప్పారు.












Click it and Unblock the Notifications