డ్రంక్ అండ్ డ్రైవింగ్‌లో పట్టుబడ్డ మాజీ ఎంపీ కొడుకు!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మాజీ పార్లమెంటు సభ్యుడు సురేష్ షెట్కార్ కుమారుడు రాకేష్‌ను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మద్యం తాగిన రాకేష్ పోలీసు వాహనంపై దాడి చేశారు. మద్యం తాగి వాహనం నడపటమే కాకుండా పోలీసులపై దాడిచేసిన కేసులో పంజాగుట్ట పోలీసులు అతనితో పాటు నలుగురిని అరెస్ట్ చేశారని తెలుస్తోంది.
భార్యను హతమార్చిన భర్త
మెదక్ జిల్లా మనూర్ మండలం కరోర్‌కుర్తి గ్రామంలో అమీషాబాయి అనే మహిళను ఆమె భర్త హతమార్చారు. హత్యకు కారణాలు తెలియరాలేదు. పోలీసులు సంఘటన స్థలానికి వెళుతున్నారు.

తండ్రిని చంపిన తనయుడు
మద్యానికి బానిసైన కొడుకు తాగడానికి డబ్బులు ఇవ్వలేదని కన్న తండ్రినే చంపిన ఘటన చిక్కడపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్‌పెక్టర్ కథనం ప్రకారం.. తుకారం భార్య నర్సబాయితో దమలగూడ మైసమ్మబండ బస్తీలో ఉంటున్నారు. వీరికి ఆరుగురు కూతుళ్లు, ముగ్గురు కొడుకులు.
పెద్ద కొడుకు వైద్యాథ్ మద్యానికి బానిసయ్యాడు. ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉంటూ జులాయిగా తిరుగుతున్నాడు. అతనికి ఇద్దరు పిల్లలు. భార్యను తరుచూ కొట్టేవాడు. దీంతో కొద్ది రోజుల క్రితం భార్య పుట్టింటికి వెళ్లింది. సోమవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో మద్యం తాగేందుకు డబ్బులు కావాలని తల్లిని వేధించాడు. తండ్రిని కూడా అడిగాడు.
ఓ సమయంలో ఆవేశంగా తండ్రిని ఇనుపరాడ్డుతో కొట్టాడు. దీంతో తండ్రి చనిపోయాడు. తమ్ముడు కిషన్‌ను కూడా రాడ్డుతొ కొట్టి అక్కడి నుండి పారిపోయాడు. కిషన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్యనాథ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications