రేవంత్ సొంతూరులో మాజీ సర్పంచ్ ఆత్మహత్య: సీఎం బ్రదర్స్ చేసిన హత్యేనంటూ కేటీఆర్

నాగర్‌కర్నూల్: వంగూరు మండలం కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన సూసైడ్ నోట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడటం వెనుక ఓ కారణం ఉంది.
ఇటీవల గ్రామంలో నూతనంగా నిర్మించబడిన పశు వైద్యశాల ప్రహారీ గోడ నిర్మాణమే మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. పశువైద్య శాల వెనకాలే సాయిరెడ్డి ఇల్లు ఉండగా, ఆయన ఇంటికి దారిలేకుండా పశువైద్యశాల ప్రహారీ గోడను నిర్మించారంటూ వాపోయారు. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన సాయి రెడ్డి కల్వకుర్తి వచ్చి పురుగుల మందు తాగాడు.

అదే సమయంలో పెట్రోలింగ్ పోలీసులు గమనించి ఆస్పత్రికి తరలించే లోపే సాయి రెడ్డి మృతి చెందాడు. అయితే, సాయి రెడ్డి రాసినట్లుగా చెబుతున్న సూసైడ్ నోట్‌లో తాను సీఎం రేవంత్ రెడ్డి అన్నదమ్ముల వేధింపులు తట్టుకోలేక చనిపోతున్నట్లు సాయిరెడ్డి పేర్కొనడం సంచలనంగా మారింది.

Former sarpanch commits suicide in CM Revanth s hometown

ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరులోనూ ప్రజలకు రక్షణ లేదని మండిపడుతున్నారు. కొండారెడ్డి పల్లె గ్రామ మాజీ సర్పంచ్‌ సాయిరెడ్డి ఆత్మహత్యకు పాల్పడటం కలచివేసింద‌ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు అన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత గ్రామంలో ఉన్న దారుణ పరిస్థితికి సాయిరెడ్డి ఆత్మహత్య నిదర్శనం అని ఆయ‌న అన్నారు.

రేవంత్.. నీ సొంత గ్రామ మాజీ సర్పంచ్ ఆత్మహత్య ఉసిగొల్పిన వాళ్లపై చట్ట రీత్యా చర్యలకు సిద్ధమా..? మీ అన్నదమ్ముళ్ల అరాచకాలు శృతి మించాయనడానికి ఇది నిదర్శనం కాదా..? సాయిరెడ్డి మృతికి కారణమైన మీ అన్నదమ్ముళ్ల‌పై చట్టరీత్యా హత్యా నేరం పెట్టాలి అని హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు.

మరోవైపు, కేటీఆర్ కూడా రేవంత్ సోదరులపై ధ్వజమెత్తారు. సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పాముకుంట్ల సాయిరెడ్డిది ఆత్మహత్య కానే కాదు.. ముఖ్యమంత్రి సోదరులు చేసిన హత్యనే అని ఆరోపించారు. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ లో చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి బ్రదర్స్ తనపై కక్ష కట్టడం వల్లే చనిపోతున్నానని సాయిరెడ్డి స్పష్టంచేసిన నేపథ్యంలో.. దీనికి సీఎం రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

పోలీసులు సూసైడ్ నోట్ ఆధారంగా అనుముల బ్రదర్స్ పై కేసు నమోదుచేసి సమగ్ర దర్యాప్తు జరిపించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రదర్స్ అరాచకాలు తట్టుకోలేక సీఎం స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పాముకుంట్ల సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. ఇది ఆత్మహత్య కానే కాదు.. ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి సోదరులు చేసిన హత్య ఇది అని అన్నారు.

ఆరు నెలల క్రితం ఒక యూట్యూబ్ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారనే కక్షతో.. 40 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇంటి ముందు పశువుల దవాఖానాను కట్టడమే కాకుండా.. సీఎం ఆదేశాలతో ఇంటికి దారి కూడా లేకుండా అడ్డంగా గోడ కట్టేందుకు పూనుకోవడంతోనే తీవ్ర మనస్థాపానికి గురై సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు.

రెండుసార్లు కొండారెడ్డిపల్లికి సర్పంచ్ గా ఎన్నో సేవలందించిన వ్యక్తిని గౌరవించాల్సింది పోయి, 85 ఏళ్ల వయస్సున్న పెద్దాయన అని కూడా చూడకుండా గత కొన్ని నెలలుగా వేధింపులకు గురి చేయడంతో తట్టుకోలేకే చివరికి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు.

ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ లో చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి బ్రదర్స్ తనపై కక్ష కట్టడం వల్లే చనిపోతున్నానని సాయిరెడ్డి స్పష్టం చేసిన నేపథ్యంలో.. దీనికి సీఎం రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలి. పోలీసులు సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదుచేసి సమగ్ర దర్యాప్తు జరిపించాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

ఇటీవల సొంత నియోజకవర్గం కొడంగల్ లో గిరిజన ఆడబిడ్డలపై దమనకాండ ను దేశం మరిచిపోకముందే.. సీఎం సొంత గ్రామంలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన చూస్తుంటే.. రాష్ట్రంలో సీఎం, ఆయన సోదరుల అరాచకాలకు అంతే లేకుండా పోయిందని స్పష్టమవుతోంది. ఇది ప్రజాపాలన కాదు.. అరాచక పాలన, నియంత పాలన, దుర్మార్గపు పాలన.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+