జహీరాబాద్ మాజీ ఎమ్మెల్యే చెంగల్ భాగన్న కన్నుమూత...
జహీరాబాద్ మాజీ ఎమ్మెల్యే చెంగల్ భాగన్న(86) కన్నుమూశారు. అనారోగ్యంతో 20 రోజులుగా నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం(ఫిబ్రవరి 26) సాయంత్రం తుది శ్వాస విడిచారు. గత రెండేళ్లుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. ఆయనకు ఇద్దరు కుమారులు,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జహీరాబాద్‌లో శనివారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే చెంగల్ భాగన్న మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ప్రజాసేవ కోసం జీవితం అంకితం చేసిన భాగన్న నేటి తరం నాయకులకు ఆదర్శప్రాయుడని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

జహీరాబాద్ మండలం గోపన్‌పల్లికి చెందిన బాగన్న వార్డు సభ్యుడిగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఆ తర్వాత సర్పంచి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు ఎదిగారు. 1994లో టీడీపీ తరుపున జహీరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో బీజేపీ తరుపున జహీరాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు.
అత్యంత నిరాడంబర జీవితం గడిపిన చెంగల్ భాగన్నకు ఇప్పటికీ సొంత ఇల్లు కూడా లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన అద్దె ఇంట్లోనే ఉంటున్నట్లు తెలుస్తోంది. భాగన్న సతీమణి మాణెమ్మ 15 ఏళ్ల క్రితం జహీరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications