హైద్రాబాద్‌లో కూలిన నాలుగంతస్తుల భవనం, కూలీలు పరుగు
హైదరాబాద్: షేక్‌పేటలో నిర్మాణంలో ఉన్న ఓ నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. కూలడానికి కొద్దిసేపటి క్రితం నుంచి భవనం కదులుతుండటంతో భవనంలో పని చేస్తున్న కార్మికులు ఒక్కసారిగా బయటకు పరుగెత్తుకు వచ్చారు.
వారు బయటకు వచ్చిన కొద్ది సేపటికే భవనం కూలిపోయింది. దీంతో ప్రాణ నష్టం జరగలేదు. ఘటనా స్థలానికి మున్సిపల్ అధికారులు, పోలీసులు చేరుకున్నారు. ఐదంతస్తుల్లోను మూడు ఫ్లోర్లు కుప్పకూలాయి. ఇది పక్కనే ఉన్న మరో భవనంపై ఒరిగిపోయింది. భవనం ముందే కదలడం, కార్మికులు గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది.
పోడు భూముల గొడవ

ఖమ్మం జిల్లాలోని ఇల్లందు మండలం బొజ్జాయిగూడెంలో పోడు భూముల విషయంలో అటవీ శాఖ అధికారులు, గిరిజనుల మధ్య ఘర్షణ జరిగింది. పరిస్థితి అదుపు తప్పడంతో పలువురు గిరిజనులు పోలీసులను అదుపులోకి తీసుకున్నారు.
వర్క్ ఫర్ మేనేజ్‌మెంట్ సిస్టం ప్రారంభం
పోలీసు వర్క్ ఫర్ మేనేజ్‌మెంట్ సిస్టం యాప్‌ను హైదరాబాద్ నగర సీపీ మహేందర్ రెడ్డి ప్రారంభించారు. దీనిని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ రూపొందించింది. పోలీసు శాఖలో రోజువారీ పనితీరును సమీక్షించేందుకు ఈ సిస్టం ఉపయోగపడుతుందని మహేందర్ రెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications