• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నాలుగేళ్ల కేసీఆర్ పాల‌న‌.. మిశ్ర‌మ ఫ‌లితాల స‌మాహారం

|
  నాలుగేళ్ల కేసీఆర్ పాల‌న‌ పై ప్రజల స్పందన

  తెలంగాణాను బంగారు తెలంగాణాగా మార్చే సామర్థ్యం కేసీఆర్ కే ఉందని., కేసీఆర్ నాయకత్వానికి నీరాజనాలు పడుతున్నారు తెలంగాణా ప్రజలు. కేసీఆర్ పాల‌న‌కు నాలుగేళ్లు నిండుతున్నసంద‌ర్బంగా ప్ర‌జ‌ల‌నుండి మిశ్ర‌మ స్పంద‌న ల‌భిస్తోంది. ఇచ్చిన హామీల‌ను పూర్తి స్థాయిలో నెర‌వార్చాల్సి ఉంద‌ని కొంద‌రు అభిప్రాయ ప‌డ‌గా., తెలంగాణ‌లో అద్బుత ప‌రిపాల‌న అందిస్తున్నార‌ని కేసీఆర్ పైన ప్ర‌సంశ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు ప్ర‌జ‌లు.

  స్వీయ ప‌రిపాల‌నా సౌర‌భాలు.. ఆస్వాదిస్తున్న తెలంగాణ ప్ర‌జానికం..

  స్వీయ ప‌రిపాల‌నా సౌర‌భాలు.. ఆస్వాదిస్తున్న తెలంగాణ ప్ర‌జానికం..

  స్వీయ పాలనా సౌరభాలను తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలో ఆస్వాదిస్తున్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణా నేతలు ఉద్బోదించిన సొంత నీళ్లు, నిధులు, నియామకాల సిద్దాంతాన్ని చెక్కు చెదరకుండా కాపాడుకున్నారు. ప్రభుత్వం పై వివమర్శలు వెల్లువెత్తినా అవి విపక్షాల స్వార్థ పూరిత ఆరోపణలే అని తేల్చి చెప్తున్నారు నాయ‌కులు. స్వీయపాలన లోని బలహీనతలను, లోపాలను స‌రిదిద్దుకునేందుకు కొంత సమయం కావాల‌నే దిశాగా కేసీఆర్ ప్ర‌భుత్వం అడుగులు వేస్తోంది. రాత్రికి రాత్రే అద్బుతాలు ఆవిష్ర్కుతం కావనే సిద్దాంతాన్ని కూడా గులాబీ నేత‌లు వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా గ‌తంలో జ‌రిగిన ఉప ఎన్నిక‌లు కూడా తెలంగాణ తొలి రాష్ర్ట రథ సారథిగా కేసీఆర్ పట్ల పూర్తి స్థాయిలో విశ్వాసాన్ని ప్రకటించాయి. కేసీఆర్ పరిపాలనలోని చిన్న చిన్న లోపాలను కూడా లెక్క చేయకుండా వీర తిలకం దిద్దుతూ గో అహెడ్ అంటున్నారు తెలంగాణ ప్ర‌జ‌లు.

  కేసీఆర్ ప్ర‌జారంజ‌క పాల‌న‌... ప‌థ‌కాల అమ‌లులో అగ్ర‌స్థానం..

  కేసీఆర్ ప్ర‌జారంజ‌క పాల‌న‌... ప‌థ‌కాల అమ‌లులో అగ్ర‌స్థానం..

  క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రిగా నాలుగేళ్ల పాలనలో తీసుకున్న నిర్ణయాలను, అమలువుతున్న తీరును క్షేత్ర స్థాయిలో వివ‌రించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు గులాబీ నేత‌లు. ప్రభుత్వ పరిపాలనా సౌలభ్యం కోసం చేపట్టిన జిల్లాల పునర్విభజన, పింఛన్లు-జీవనభృతి, మైనారిటీ సంక్షేమం, మౌలికవసతుల కల్పన, రైతుబంధు, రైతుబీమా, ప్రాజెక్టుల నిర్మాణం, విద్యావైద్యంపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్‌ నాలుగేళ్లుగా సాధించిన విజయాలు చాలానే ఉన్నాయి.ప్రతిపక్షాల హడావిడి అంతా రాజకీయ ప్రయోజనాల కోసం తప్ప మరో కారణం కాదని, వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకొని ప్రజలకు వివరించడంలో ప్రతిపక్షాలు విఫలం చెందాయని, అందుకు తగ్గట్టుగానే వివిద ప్రాంతాల్లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో ప్రజలు తెలివైన తీర్పు ఇచ్చారని తెలుస్తోంది.

   ప‌రిపాల‌నా వికేంద్రీక‌ర‌ణ‌.. క్షేత్ర స్థాయికి చేరుతున్న ప‌థ‌కాలు..

  ప‌రిపాల‌నా వికేంద్రీక‌ర‌ణ‌.. క్షేత్ర స్థాయికి చేరుతున్న ప‌థ‌కాలు..

  పది జిల్లాల తెలంగాణను 31 జిల్లాలుగా విభజిస్తూ కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంతో వికేంద్రీకర‌ణ గా మారి పరిపాలన ప్రజలకు చేరువైంది. జిల్లా కేంద్రాలు కూతవేటు దూరంలోకి వచ్చాయి. మంచినీటి కోసం మిషన్‌ భగీరథ, సాగునీటి కోసం మిషన్‌ కాకతీయ, 24 గంటల విద్యుత్‌ సౌకర్యం వంటివి విజయవంతంగా అమలుచేస్తుండ‌డంతో కేసీఆర్ ప్ర‌భుత్వం పై ప్ర‌జ‌ల్లో సానుకూల ద్రుక్ప‌థం ఏర్ప‌డింది. వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, వికలాంగులు ఇలా అందరికీ పింఛన్‌ అందిస్తున్నవిధానానికి కూడా పెద్ద యెత్తున మ‌ద్ద‌త్తు ల‌భిస్తోంది. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమపథకాలను వివరించడంలో ప్ర‌జ‌ల్లో చైత‌న్యం క‌లిగించాల‌ని ప్ర‌భుత్వం కార్య‌చ‌ర‌ణ రూపొందించ‌బోతోంది. తెలంగాణలో రైతులకు భరోసా కల్పించడంలో సీఎం కేసీఆర్‌ విజయం సాధించారనే చెప్పాలి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలను ఆకర్షిస్తున్నాయని నేతలు పదేపదే చెప్తున్నారు. కేసీఆర్‌ తీసుకున్న ప్రతి పథకం దేశ రాజ‌కీయ‌నేత‌ల‌ దృష్టిని ఆకర్షిస్తుందని, త్వరలోనే జాతీయస్థాయిలో అన్ని పార్టీలకు ఇవే మ్యానిఫెస్టోలుగా మార‌నున్న‌య‌నే అభిప్ర‌యాలు వ్య‌క్తం అవుతున్నాయి.

  రైతు శ్రేయ‌స్సే ద్యేయం.. సాగు, త్రాగునీరే ల‌క్ష్యం..

  రైతు శ్రేయ‌స్సే ద్యేయం.. సాగు, త్రాగునీరే ల‌క్ష్యం..

  రాష్ట్రంలో కరువును నివారించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేప‌ట్టిన‌ట్టు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌లు సంద‌ర్బాల్లో వెళ్ల‌డించారు. ప్రధానంగా వ్యవసాయాన్ని పండగచేసి రైతు కళ్లలో ఆనందం చూస్తానని ప్రకటించారు. అందుకు అనుగుణంగా కార్యక్రమాలను వెల్లడించారు. ఈ నాలుగేళ్లలో నిరంతర విద్యుత్ అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంద‌ని చెప్తున్నారు. ఇక మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాల అధ్యయనం కోసం వివిధ రాష్ట్రాల అధికారులు రాష్ట్రాన్ని సంద‌ర్శిప్తున్నారంటే అవి ఎంతగా ప్రాచుర్యం పొందాయో చెప్పకరలేదు. ఇంటింటికి మంచినీళ్లు ఇవ్వలేకపోతే రాబోవు ఎన్నిక‌ల్లో ఓట్లడగనని చెప్పిన నేతగా ఇప్పటికే కెసిఆర్‌ చరిత్ర సృష్టించారు. ఈ మేరకు మిషన్‌ భగీరథ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

  ప్ర‌జ‌ల్లో మిగిలిన అసంత్రుప్తిని పార‌దోలుతాం.. క‌లిసిక‌ట్టుగా ముందుకు సాగుతాం...

  ప్ర‌జ‌ల్లో మిగిలిన అసంత్రుప్తిని పార‌దోలుతాం.. క‌లిసిక‌ట్టుగా ముందుకు సాగుతాం...

  నాలుగేళ్లుగా చేపట్టిన ప్ర‌జాహిత కార్యక్రమాలు ప్ర‌జ‌ల్లోకి దూసుకెళ్లినా, భ‌విష్య‌త్ క‌ళ్ల ముందు సాక్షాత్క‌రిస్తున్నా ప్రజల మదిలో ఎక్కడో ఏదో అసంత్రుప్తి ఉంద‌నే భావ‌న వ్య‌క్తం అవుతోంది. సామాన్య ప్ర‌జానికం త‌మ‌కు ఉద్యమ ఫలాలు పూర్తి స్థాయిలో దక్కలేదన్న అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. కుటుంబ పాల‌న కొన‌సాగిస్తున్నారనే అప‌వాదు నుండి బ‌య‌ట‌ప‌డేందుకు సంస్థాగ‌తంగా కొన్ని మార్పుల‌కు రూప‌క‌ల్ప‌న చేయ‌బోతున్నారు ముఖ్య‌మంత్రి. అందుకే ఈ నాలుగేళ్ల ప్ర‌జాహిత కార్యక్రమాలే కాకుండా త్వరలో తీసుకోబోయే విప్లవాత్మక నిర్ణయాలను అసంత్రుప్తిగా ఉన్న మ‌రో వ‌ర్గానికి అనుకూలంగా ఉండ‌బోతుంద‌ని కేసీఆర్ భ‌రోసా ఇస్తున్నారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Kalvakuntla chandra sekhar rao has completing his 4 years tenure as first chief minister for telangana. as formation telangana on june 2nd he decided some unique policies for the public. kcr planing to take gigantic decision in favor of telangana people. but some telangana people expressing negative opinions on the kcr ruling.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more