గుండెపోటుతో పద్నాలుగేళ్ల బాలుడు మృతి...
దేశంలో ప్రస్తుతం గుండెపోటు మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉంది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరూ గుండెపోటు గురై చనిపోతున్నారు. అయితే, ఈ మరణాలకు కారణం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లనని నిపుణులు అంటున్నారు. ఈ మధ్యకాలంలో డ్యాన్స్ చేస్తూ, ఆడుతూ, పాడుతూ ఉండే వారు కూడా హార్ట్ ఎటాక్ గురై చనిపోవడం వంటి వార్తలు వింటూనే ఉన్నాయి. ఇప్పడు తాజాగా ఓ పద్నాలుగేళ్ల బాలుడి గుండెపోటుతో స్కూల్లోనే మృతిచెందాడు. ఆ వివరాలేంటో చూద్దాం..
సిరిసిల్ల జిల్లా కందికట్కూర్ గ్రామానికి చెందిన ఓ 14 ఏళ్ల బాలుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ బాలుడు 8వ తరగతి చదువుతున్నాడు. ఈ బాలుని పేరు సాయితేజ. పాఠశాలకు వెళ్లిన ఈ బాలుడు స్కూల్ ఆవరణలోనే తోటి విద్యార్థులతో ఆడుకుంటూ అక్కడిక్కడే ఉన్నట్లుండి కుప్పకూలిపోయాడు. గమనించిన ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు ఆసుపత్రికి తరలించగా ఆ బాలుడు మృతిచెందాడని వైద్యులు నిర్థారించారు.

అయితే, సాయితేజకి పుట్టుకతోనే గుండెకు రంధ్రం ఉందని తెలిసింది. బాలునికి ఆపరషన్ తప్పనిసరి అని వైద్యులు పలు మార్లు బాలుని తల్లిదండ్రులని హెచ్చరించినా ఆపరేషన్ చేయించే స్థోమత లేకపోవడంతో తల్లిదండ్రులు వైద్యం చేయించలేదని తెలిసింది. ఆ చిన్నారి మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అప్పటివరకూ తమతో ఆడుకున్న మిత్రుడు లేకపోవడంతో తోటి విద్యార్థులు కంటతడి పెట్టారు.
చిన్నపిల్లలో గుండెపోటు లక్షణాలు..
కొవిడ్ 19 తర్వాత దేశంలో ఎంతో మంది యువకులు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా గుండెపోటు గురై బలైపోతున్నారు. అయితే, సరైన ఆహారపు అలవాట్ల, జీవనశైలి పాటిస్తే గుండెపోటు నుంచి జాగ్రత్తగా ఉండొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అరిథ్మియా(గుండె వేగంగా కొట్టుకోవడం), ఆకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం, అలసట,ఛాతీలో అసౌకర్యం, తలతిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండెలో దడ, వంటి లక్షణాలు చిన్నపిల్లలో కనిపిస్తే వెంటనే అలర్ట్ కావాలని నిపులు అంటున్నారు.












Click it and Unblock the Notifications