Maha Lakshmi Scheme: మహాలక్ష్మి పథకం పేరుతో నకిలీ ఐడీ కార్డులు..
తెలంగాణలో ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇందులో రెండు గ్యారెంటీలను ఇప్పటికే అమలు చేస్తున్నారు. త్వరలో మిగతా గ్యారెంటీలు అమలు చేస్తామని చెబుతున్నారు. ముఖ్యంగా మహిళలకు మహాలక్ష్మి పేరుతో ఉచిత బస్ ప్రయాణం, రూ.500 లకే సిలిండర్, మహిళకు రూ.2500 ప్రకటించారు. ఇందులో ఉచిత బస్ ప్రయాణం ప్రారంభం అయింది.
అయితే ఈ మహాలక్ష్మి పథకాన్ని కొంత మంది కేటుగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. అమాయక మహిళలను మోసం చేస్తూ ఫేక్ ఐడీ కార్డులు అంటగడుతున్నారు. తాజాగా ఓ కార్డు మహాలక్ష్మి కార్డును ముద్రించారు. ఇది ఉంటేనే ఉచిత బస్ ప్రయాణం, రూ.500 లకే సిలిండర్, మహిళకు రూ.2500 వస్తాయని ప్రచారం చేస్తున్నారు. ఇది నమ్మిచాలా మంది రూ.100 చెల్లించి ఆ కార్డును కొనుగోలు చేస్తున్నారు.

ముఖ్యంగా ఊళ్లలో ఉండే మహిళలను మోసం చేస్తూ రూ.100 లకు నకిలీ కార్డులు అంటగడుతున్నారు. పింక్ కలర్ లో ఉన్న ఆ కార్డుపై మహాలక్ష్మి అని రాసి ఉంది. ఈ కార్డు సోనియా గాంధీ సంతకాన్ని కూడా ముద్రించడంతో పాటు కాంగ్రెస్ గుర్తు, సోనియా గాంధీ ఫొటోలు కూడా ముద్రించారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఎవరికీ ఎలాంటి కార్డులు జారీ చేయాలేదు.
ఎవరైన అలా కార్డులు అమ్ముతు మీకు కనిపిస్తే వెంటనే అధికారులు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. మహలక్ష్మి పథకానికి విధివిధానాలు కూడా రూపొందించలేదన్నారు. దీనికి కొంత సమయం పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్న మహాలక్ష్మి కార్డులు అన్నీ నకిలీవని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications