వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దాసరి ప్రస్థానం: అతిసామాన్య కుటుంబం నుంచి వచ్చి... బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఎదిగి...

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని అతిసామాన్య వ్యవసాయ కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా పార్లమెంటు దాకా ఎదిగిన దాసరి నారాయణరావు సినీ ప్రస్థానంలో కొన్ని మైలురాళ్లు.. మీకోసం.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సగటు సినీ ప్రేక్షకుడికి పరిచయం అక్కర్లేని పేరు.. దాసరి నారాయణరావు. దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేశారు. 80 ఏళ్ల తెలుగు సినిమాను విశ్లేషించాల్సి వస్తే.. దాసరికి ముందు, దాసరికి తర్వాత అని అభివర్ణించాల్సిందే.

తన 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో తెలుగు సినిమాపై 'దర్శకరత్న'గా ఆయన చెరగని ముద్రవేశారు. ఎంతోమంది దర్శకులకు పాఠాలు నేర్పిన ఆయన.. తనదైన నటనతో వెండితెర అభిమానులను మురిపించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని ఓ వ్యవసాయ కుటుంబంలో పుట్టిన దాసరి పార్లమెంటు దాకా ఎదిగిన సినీ ప్రస్థానంలో కొన్ని మైలురాళ్లు.. మీకోసం.

అతిసామాన్య కుటుంబంలో జన్మించి...

అతిసామాన్య కుటుంబంలో జన్మించి...

పాలకొల్లులో అతిసామాన్యమైన కుటుంబంలో జన్మించిన దాసరి నారాయణరావు... ఇంట్లో మూడోవాడు. దాసరి తండ్రి సాయిరాజు, వాళ్ల పెద్దనాన్న కలిసి పొగాకు వ్యాపారం చేసేవారు. ఓ సారి దీపావళి పండుగ వేళ... పొగాకు గోదాము తగలపడిపోవడంతో.... ఆ కుటుంబం ఆర్థికంగా దెబ్బతింది. ఆ సమయంలో వాళ్లకున్న పొలాలు కూడా అమ్మేయాల్సి వచ్చింది. దాసరిని మాత్రమే బడికి పంపించిన వాళ్ల నాన్న... పొగాకు వ్యాపారం దెబ్బతినడంతో మధ్యలోనే చదువు మాన్పించేశారు.

కష్టనష్టాలకోర్చి చదువుకుని...

కష్టనష్టాలకోర్చి చదువుకుని...

ఆరో తరగతిలో ఉండగానే దాసరిని వడ్రంగి దుకాణంలో పనికి పెట్టారు వాళ్ల నాన్న. నెలకు రూపాయి జీతంగా కొంతకాలం పనిచేసిన దాసరి...ఆ తర్వాత ఓ మాస్టారు సహాయంతో మళ్లీ చదువు కొనసాగించారు. అలా... డిగ్రీ వరకు చదువు పూర్తి చేశారు. డిగ్రీలో ఉండగానే నాటకాల్లో ఆసక్తిని పెంచుకున్న దాసరి... చిన్నచిన్న నాటకాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ ఆసక్తే... దాసరిని సినీ పరిశ్రమ పట్ల ఆకర్షితుణ్ని చేసింది. అప్పట్లో అగ్ర నిర్మాతగా ఉన్న రాఘవగారు నిర్మించిన "తాత-మనవడు" చిత్రంతో దర్శకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు.

నాట‌క‌రంగం నుంచి సినీ రంగానికి వ‌చ్చి...

నాట‌క‌రంగం నుంచి సినీ రంగానికి వ‌చ్చి...

ఇంతింతై వటుడింతై అన్నట్లుగా నాటకరంగం నుంచి సినీరంగ ప్రవేశం చేసి తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డగా ఎన్నో కీర్తిప్రతిష్ఠలు అందుకున్నారు దాసరి నారాయణరావు. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి అగ్రనటులతో సినిమాలు తీసి జాతీయ స్థాయి పురస్కారాలు కూడా అందుకున్నారు. ఎన్టీఆర్ సినీ, రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పిన ఎన్నో చిత్రాలకు దాసరి దర్శకత్వం వహించారు.

బహుముఖ ప్రజ్ఞాశాలి...

బహుముఖ ప్రజ్ఞాశాలి...

నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనలోని ప్రతిభను ఎప్పటికప్పుడు పరిశ్రమకు పరిచయం చేసిన దాసరి... 'తాత మనవడు' చిత్రంతో దర్శకుడిగా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 150 కిపైగా చిత్రాలను ఆయన తెరకెక్కించారు. అలాగే నిర్మాతగా 53 చిత్రాలను నిర్మించారు. 250 కిపైగా చిత్రాలకు మాటలు, పాటలు అందించారు. 'మామగారు', 'సూరిగాడు', 'అమ్మ రాజీనామా', 'ఒసేయ్ రాములమ్మ', 'మేస్త్రీ', 'ఎర్రబస్సు' లాంటి చిత్రాల్లో నటించిన దాసరి తన నటకౌశలాన్ని బయపెట్టారు. వర్తమాన, సామాజిక అంశాలే ఇతివృత్తంగా తన చిత్రాలను తెరకెక్కించిన దాసరి... విమర్శకులను సైతం మెప్పించగలిగారు.

అవార్డుల పంట...

అవార్డుల పంట...

రెండు జాతీయ పురస్కారాలు, తొమ్మిది నంది పురస్కారాలు, 6 ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు అందుకున్న దాసరి... తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటించి ఉత్తమ నటుడిగా పేరు తెచుకున్నారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడిగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో దాసరి చోటు దక్కించుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో దాసరి చిత్రాలు తెలుగు సినిమా సత్తాను చాటాయి. తాండ్ర పాపరాయుడు, సూరిగాడు వంటి చిత్రాలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించగా...‘కంటే కూతుర్నే కను' చిత్రానికి 2000 సంవత్సరంలో జాతీయ పురస్కారం దక్కింది. అలాగే 1982లో మేఘ సందేశం చిత్రానికి ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం అందుకున్నారు దాసరి. చికాగో, కేన్స్, మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్ లో మేఘసందేశం చిత్ర ప్రదర్శన విమర్శకుల ప్రశంసలందుకుంది.

మరపురాని చిత్రాలు.. మధుర జ్ఞాపకాలు

మరపురాని చిత్రాలు.. మధుర జ్ఞాపకాలు

ఎన్టీఆర్ సినీ జీవితంలో కీలకమైన బొబ్బిలిపులి, సర్దార్ పాపారాయుడు చిత్రాలు, ఊర్వశి శారద ప్రధాన పాత్రలో నటించిన అమ్మ రాజీనామా, ఒసేయ్ రాములమ్మ చిత్రాలు దాసరి సినీజీవితంలో మరుపురాని చిత్రాలుగా నిలిచిపోయాయి. గోరింటాకు, ప్రేమాభిషేకం, ఒసేయ్ రాములమ్మ, మేఘ సందేశం చిత్రాలకు ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్న దాసరి... మేస్త్రి, మామగారు చిత్రాలకు ఉత్తమ నటుడిగా నంది పురస్కారాలు వరించాయి. తాతమనవడు, స్వర్గం -నరకం, సంసారం-సాగరం, బంగారు కుటుంబం, మేఘ సందేశం, కంటే కూతుర్నే కను చిత్రాలకు ఉత్తమ ఫ్యూచర్ ఫిల్మ్ గా నంది పురస్కారాలు అందుకున్నారు. 1981లో ప్రేమాభిషేకం చిత్రానికి స్పెషల్ జ్యూరీగా నంది పురస్కారం దక్కింది.

24 విభాగాలపై తనదైన శైలిలో...

24 విభాగాలపై తనదైన శైలిలో...

ప్రజలను ప్రభావితం చేసే ఎన్నో ఉత్తమ చిత్రాలను అందించిన దాసరి... నాటక, సినీ రంగంలో విశేష కృషికి గాను 1986లో ఆంధ్రా విశ్వవిద్యాలయం అయన్ని కళాప్రపూర్ణ పురస్కారంతో సత్కరించింది. 2001లో జీవిత సాఫల్య పురస్కారాన్ని దాసరి అందుకున్నారు. నటుడు, దర్శకుడు, నిర్మాత, రచయితగా... 24 విభాగాలపై తనదైన శైలిలో పనిచేసి కళాకారుల ఉనికి కోసం పరితపించే దాసరి... చిత్ర సీమలో ‘దర్శకరత్న'గా ఎదిగారు.

ప్రతిభను ప్రోత్సహిస్తూ... పరిచయం చేస్తూ

ప్రతిభను ప్రోత్సహిస్తూ... పరిచయం చేస్తూ

చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ప్రతిభను ప్రోత్సహించే దాసరి నారాయణరావు... పరిశ్రమకు కొత్తనీరు రావాలని పరితపించే వారు. ప్రతిభ ఎక్క‌డున్నా గుర్తించి ప్రపంచానికి పరిచయం చేసే దాసరి... 13 మంది కథానాయికలను, 15 మందికిపైగా కథానాయకులను, ఎంతో మంది దర్శకులు, సంగీత దర్శకులు, నృత్యదర్శకులను తెలుగు చలన చిత్ర సీమకు పరిచయం చేశారు.

పరిశ్రమకే ‘గురువు’గా...

పరిశ్రమకే ‘గురువు’గా...

స్వర్గం-నరకం చిత్రంతో మోహన్ బాబును పరిచయం చేసిన దాసరి... సంగీత చిత్రంతో ఆర్.నారాయణమూర్తికి కొత్త జీవితాన్ని అందించారు. అలాగే రమేష్ బాబు, మహేశ్ బాబు లను ‘నీడ' చిత్రం ద్వారా వెలుగులోకి తెచ్చిన దాసరి... నర్సింహారాజు, ఈశ్వర్ రావు, బాలాజీ, హరిప్రసాద్, త్రినాథ్, హాస్యనటుడు జయప్రకాశ్ రెడ్డిలను తెరమీదకు తీసుకొచ్చారు. జయసుధ, జయప్రద, మాదవి, శ్రీదేవి, సుజాత, స్వప్న, సిల్క్ స్మిత, రజినీ, శుభశ్రీ, అలేఖ్య, అన్నపూర్ణ, ఫటాఫట్ జయలక్ష్మి లను కథానాయికలుగా తెరపైకి తీసుకొచ్చి తిరుగులేని నాయికలుగా తీర్చిదిద్దారు. ఇలా ఎంతో మంది శిష్యులను తయారు చేసుకున్న దాసరి నారాయణరావు... పరిశ్రమ "గురువు"గా గుర్తింపు తెచ్చుకున్నారు.

English summary
From Earth to Sky... Director Dasari's Life Tour
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X