Podu pattalu: జూన్ 24 నుంచి 30 వరకు పోడు భూముల పట్టాల పంపిణీ..

పోడు రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జూన్ 24 నుంచి 30 వరకు పోడు భూముల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది. పట్టాలతో పోడు భూములకు రైతు బంధు ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆర్ఓఎఫ్ఆర్ ద్వారా రైతుబంధు పొందుతున్న వారితో పాటు కొత్తగా పోడు పట్టాలు అందుకోబోతున్న గిరిజన లబ్దిదారులతో క్రోడికరించి.. రాష్ట్రంలో మిగతా రైతులకు ఎలాగైతే రైతుబందు అందుతోందో, వీరికి కూడా అదే పద్ధతిలో రైతుబందు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

ప్రభుత్వమే బ్యాంక్ అకౌంట్‌ను తెరిచి, పోడు భూముల పట్టాల యాజమానులకు నేరుగా వారి ఖాతాల్లోనే రైతుబంధును జమచేయాలని స్పష్టం చేశారు. కొత్తగా పోడు పట్టాలు అందుకునే గిరిజన రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను ఆర్థిక శాఖ వారికి అందజేయాలని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌కు సూచించారు.పోడు భూముల పంపిణీ కార్యక్రమానికి తానే స్వయంగా హాజరవుతానని కేసీఆర్ చెప్పారు.

Podu pattalu:

పోడు రైతులు ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ జిల్లాలో అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. నల్గొండ జిల్లాలో 55,703 ఎకరాల్లో పోడు భూములు ఉండగా 20,446 మంది రైతులు పట్టా పాస్ పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. నల్గొండ జిల్లాలో దేవరకొండ డివిజన్లోని 6 మండలాలు దేవరకొండ, చందంపేట, డిండి, నేరేడు గొమ్మ , చింతపల్లి , పీఏ పల్లి , మిర్యాలగూడ డివిజన్లో ఏడు మండలాల కాగా మిర్యాలగూడ, అడవిదేవులపల్లి, త్రిపురారం , దామరచర్ల , తిరుమలగిరి సాగర్ , పెద్దవూర , నిడమనూరు , మండలాల్లో పోడు భూముల పట్టాల కోసం గిరిజన, గిరిజనేతరులు దరఖాస్తు చేసుకున్నారు .

13 మండలాలు 160 మధిర గ్రామాలు, 120 గ్రామపంచాయతీలలో పోడు భూములు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేసింది . వీరికి వచ్చే నెలలో పట్టాలు పంపణీ చేయనున్నారు. వికారాబాద్ జిల్లాలోని 114 గ్రామపంచాయతీల్లోని పోడు భూములను గిరిజన, గిరిజనేతర రైతులు సాగు చేసుకుంటుండగా, 438 మందిని ప్రభుత్వం అర్హులుగా గుర్తించింది. అత్యధికంగా కులకచర్ల మండలంలో 186 మంది ఉండగా, పరిగి మండలంలో 77 మంది, ధారూరు మండలంలో 54 మంది, చౌడాపూర్‌ మండలంలో 33 మంది, యాలాల మండలంలో 30 మంది, దోమ మండలంలో 28 మంది, పెద్దేముల్‌ మండలంలో 11 మంది అర్హులు గుర్తించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+