హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మెల్యేల ఎర కేసు: నిందితుల విచారణ పూర్తి, ఆ డబ్బుపై ప్రశ్నలు, 25 వరకు రిమాండ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో విచారణ శుక్రవారంతో ముగిసింది. గురువారం రాజేంద్రనగర్ ఏసీపీ కార్యాలయంలో ముగ్గురు నిందితులను ప్రశ్నించిన సిట్ అధికారులు.. చివరిదైన శుక్రవారం కూడా అక్కడే ప్రశ్నించారు. ఇప్పటికే ముగ్గురు నిందితులు రామచంద్రభారతి, నందకుమార్, షింమయాజీ నుంచి స్వర నమూనాలు సేకరించిన అధికారులు భిన్న కోణాల్లో వారిని విచారించారు.

నిందితులను రెండు రోజులపాటు రాజేంద్రనగర్ ఏసీపీ కార్యాలయంలో విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు.. కస్టడీ ముగియడంతో అక్కడ్నుంచి ముగ్గురినీ ఏసీబీ కోర్టుకు తరలించారు. ఈ సందర్భంగా నిందితుల బెయిల్ పిటిషన్ పై కోర్టులో వాదనలు జరిగాయి. అనంతరం ముగ్గురు నిందితులకు నవంబర్ 25 వరకు కోర్టు రిమాండ్ విధించింది.

 FSL officers collected voice samples of accused in mla poaching case: inquiry ends, remand till NOv 25th

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంలో నిందితుల్లో ఒకరైన రామచంద్రభారతి వాంగ్మూలం కీలకమవుతుందని ప్రత్యేక దర్యా ప్తు బృందం భావిస్తోం ది. ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన.. ఎమ్మెల్యేలతో డబ్బు లావాదేవీలపై మాట్లాడటం, పైలట్ రోహిత్ రెడ్డికిడ్డి రూ.100 కోట్లు, మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల
చొప్పున ఇప్పిస్తాననడంతో ఆ డబ్బును ఎలా సమకూర్చాలనుకున్నారనే అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఇదే అంశంపై సిట్ ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది.

ఎమ్మెల్యేలతో ఫాంహౌస్‌లో బేరసారాలపై నిందితులు చెప్పిన వివరాల ఆధారంగా ప్రశ్నిం చినప్పుడు చాలా వరకు తమకు తెలియదనే సమాధానమే వచ్చినట్లు సమాచారం. నిందితులను విచారిస్తున్న రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లినళ్లి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ
ఆనంద్.. విచారణ తీరును పరిశీలించారు.

English summary
FSL officers collected voice samples of accused in mla poaching case: inquiry ends, remand till NOv 25th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X