నేడే హరికృష్ణకు అంతిమ వీడ్కోలు: ప్రముఖుల నివాళులు, ట్రాఫిక్ ఆంక్షలు
Recommended Video

హైదరాబాద్: టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ, సినీ నటుడు నందమూరి హరికృష్ణ భౌతికకాయానికి గురువారం సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నాయి. అధికారిక లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలను నిర్వహించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే.
గురువారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో మెహిదీపట్నంలోని నందమూరి హరికృష్ణ స్వగృహం నుంచి అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో సాయంత్రం 4గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తారు.

హరికృష్ణ అంతిమ యాత్ర నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మెహదీపట్నం ఎన్‌ఎండీసీలోని హరికృష్ణ ఇంటి నుంచి అంతిమ యాత్ర మొదలై సరోజిని దేవి కంటి ఆస్పత్రి, మెహదీపట్నం, రేతిబౌలి, నానల్‌నగర్, టోలిచౌకి ఫ్లైఓవర్, కేఎఫ్‌సీ, అర్చెన్ మార్బెల్స్, షేక్‌పేట్‌నాలా, ఒయాసిస్ స్కూల్, విస్పర్ వ్యాలీ జంక్షన్ నుంచి కుడివైపునకు తిరిగి జేఆర్సీ కన్వెన్షన్ మీదుగా మహాప్రస్థానం చేరుకుంటుంది.
హరికృష్ణ అంతిమ యాత్ర దృష్ట్యా పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మాసబ్ ట్యాంక్ నుంచి సరోజిని ఆస్పత్రి మార్గంలో వెళ్లే వాహనదారులు బజార్‌ఘట్, ఆసిఫ్‌నగర్ మీదుగా వెళ్లాలని సూచించారు. గచ్చిబౌలి నుంచి వచ్చేవారు ఫిల్మ్‌నగర్ మీదుగా వెళ్లాలని ఆంక్షలు విధించారు.
కాగా, మెహిదీపట్నంలోని హరికృష్ణ నివాసంలో ఉన్న ఆయన పార్థీవ దేహాన్ని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గురువారం ఉదయం హరికృష్ణకు నివాళులర్పించారు. టీఆర్ఎస్ ఎంపీ కవిత, సినీనటుడు నాగార్జున, మైసూరా రెడ్డి, మంత్రి లోకేష్, తదితరులు నివాళులర్పించారు. కాగా, భారీ సంఖ్యలో అభిమానులు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. దీంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications