నంది పురస్కారాల స్థానంలో గద్దర్ అవార్డులు: తన మాటే జీవో అన్న రేవంత్
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా అవార్డులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన గద్దర్ జయంతి కార్యక్రమంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లీ కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నంది అవార్డులు పునరుద్ధరించాలని సినీ ప్రముఖులు కోరారు.
నంది పురస్కారాల స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గద్దరన్న పేరుతో కళాకారులకు పురస్కారాలు ప్రదానం చేస్తామని చెప్పారు. దీనికి సంబంధించి త్వరలోనే జీవో జారీ చేస్తామన్నారు. అంతేగాక, ఇదే శాసనం నా మాటే జీవో అని ఈ సందర్భంగా రేవంత్ వ్యాఖ్యానించారు. గద్దర్ జయంతి సందర్భంగా ఈ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.

Nandi Awards Renamed as Gaddar Awards
— Congress for Telangana (@Congress4TS) January 31, 2024
నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు
గద్దర్ పేరుతో సినిమా అవార్డులు ఇస్తాం, త్వరలోనే జీవో జారీ
We will give film awards titled Gaddar, and verysoon a GO will be released
-- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి @revanth_anumula#RevanthReddy… pic.twitter.com/f824lqvbaj
కాగా, గద్దర్ అవార్డు పేరు ప్రకటించడంతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వచ్చి సీఎం రేవంత్ రెడ్డిని ఆలింగనం చేసుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, కమ్యూనిస్ట్ నాయకులు సీఎం నిర్ణయాన్ని ప్రశంసించారు. మరోవైపు, గద్దర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ తన ఆటపాటలతో ప్రజల్లో చైన్యం నింపారు. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications