వరంగల్‌లో పోటీకి గద్దర్ సుముఖం: తమ్మినేని వీరభద్రం
నిజామాబాద్/ మెదక్: వరంగల్ లోక్‌సభ స్థానానికి పోటీ చేసేందుకు ప్రజా గాయకుడు గద్దర్ సుముఖంగానే ఉన్నారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శుక్రవారం నిజామాబాద్‌లో సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న తమ్మినేని పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని ఆరోపించారు. వరంగల్ ఉపఎన్నికలో ఆ పార్టీకి పరాభవం తప్పదన్నారు. గద్దర్ వరంగల్ స్థానానికి పోటీ చేస్తే మద్దతిస్తామని కాంగ్రెస్, బీజేపీ, నేతలు చెప్పారని తమ్మినేని తెలిపారు.

వామపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా గద్దర్‌ను వరంగల్‌లో పోటీకి దించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గద్దర్‌ను ఒప్పించేందుకు ఇటీవల వామపక్షాల నేతలు గద్దర్‌ను కలిశారు. అయితే, గద్దర్ తన నిర్ణయాన్ని ఇప్పటి వరకు కూడా ప్రకటించలేదు.
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం 5లక్షల పరిహారాన్ని ఇవ్వాలని పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు. గురువారం ఆయన మెదక్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టులన్నీ రీడిజైన్ చేయాలని సూచించారు. అప్పుల్లో ఉన్న రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోదండరాం అన్నారు. పార్టీలకతీతంగా రైతులకు అండగా నిలుద్దామని కోదండరాం పిలుపునిచ్చారు.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications